1920: Horrors of the Heart నిరాశ పరిచిన అవికా గోర్ మూవీ కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, ఆనంద్ భట్ సమర్పణలో విక్రమ్ భట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కృష్ణ భట్ దర్శకత్వంలో యువ హీరోయిన అవికా గోర్ నటించిన చిత్రం 1920. హారర్ ఎలిమెంట్స్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన థ్రిలర్ జూన్ 23వ తేదీన రిలీజైంది. తెలుగు, హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలి రోజు మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది.ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ మనువరాలు కృష్ణా భట్ దర్శకత్వం వహించిన 1920: హారర్ ఆఫ్ ది హార్ట్ భారీ బడ్జెట్‌తో రూపొందించారు. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని 28 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగు, హిందీలో భారీగా ప్రమోషన్స్ చేశారు.

1920: హారర్ ఆఫ్ ది హార్ట్ సినిమాను దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఉత్తర భారతదేశంలో 750 స్క్రీన్లలో, తెలుగు, తమిళంలో 250 స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాను ఇతర భాషల్లో కలిపి సుమారు 1200 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హడావిడి క్రియేట్ చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
1920: హారర్ ఆఫ్ ది హార్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్లోగా జర్నీని ప్రారంభించింది. హిందీ ప్రాంతంలో ఈ చిత్రం 25 నుంచి 30 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక తెలుగు, తమిళంలో 15 నుంచి 20 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. శనివారం, ఆదివారం ఈ ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది.
1920: హారర్ ఆఫ్ ది హార్ట్ చిత్రం తొలి రోజున ఫర్వాలేదనిపించే రేంజ్‌లో కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియాలో 1.7 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. హిందీ వర్షన్ 1.4 కోట్లు వసూలు చేయగా, తెలుగు, హిందీలో 30 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
1920: హారర్ ఆఫ్ ది హార్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగానే కనిపిస్తున్నది. ఈ సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశించాలంటే.. కనీసం 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే విషయం కాస్త వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











