Ayalaan 4 days Collections శివ కార్తికేయన్ మూవీ కలెక్షన్ల సంచలనం.. అయలాన్‌కు 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
యువ డైరెక్టర్ ఆర్ రవి కుమార్ దర్శకత్వంలో కటపాడి జే రాజేష్, ఆర్డీ రాజా నిర్మించిన చిత్రం ఆయలాన్. తమిళ సూపర్ స్టార్ శివ కార్తీకేయన్, సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన చిత్రం జనవరి 12వ తేదీన రిలీజైంది. తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అయలాన్ సినిమాకు స్టార్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు పనిచేయడంతో భారీగా రెమ్యునరేషన్లు చెల్లించారు. సినిమా ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయని విధంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. దాంతో ఈ సినిమాను 80 కోట్ల రూపాయల బడ్జెట్ రూపొందించారు.

అయలాన్ మూవీ ప్రమోషన్స్‌కు ఊహించని రెస్సాన్ రావడంతో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను తమిళనాడులో 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 2500 స్క్రీన్లలో విడుదల చేశారు. కర్ణాటకలో 400 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ చిత్రం 4700 స్క్రీన్లలో రిలీజైంది. తెలుగులో త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
అయలాన్ చిత్రం తమిళంలో తొలి రోజు నుంచే గ్రాండ్‌గా ఓపెన్ అయింది. తమిళంలో తొలి రోజు 3.5 కోట్లు, రెండు రోజు 5 కోట్ల గ్రాస్, మూడో రోజు నుంచి 6 కోట్ల గ్రాస్, నాలుగో రోజు ఈ సినిమా 7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో 21.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఓవర్సీస్‌లో అయలాన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల్లో యూఎస్‌లో 2 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను, యూకేలో 1 కోటి రూపాయలను, మిడిల్ ఈస్ట్‌లో 2.5 కోట్ల రూపాయలకుపైగా, సింగపూర్‌లో 1.7 కోట్ల రూపాయలు, ఆస్ట్రేలియాలో 4 కోట్ల రూపాయలు, మలేషియాలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అయలాన్ సినిమా తొలి రోజు నుంచి భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజున 6 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 9 కోట్లు, మూడో రోజు 9 కోట్ల రూపాయల గ్రాస్, నాలుగో రోజు 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు షేర్ 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











