Ayalaan 6 days Collections తమిళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అయలాన్.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?

దక్షిణాదిలో స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అయలాన్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పైపై కోటపాడి జే రాజేష్ నిర్మించారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను గంగ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెలుగులో జనవరి 26వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విశేషాలు, అలాగే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ సినిమా ప్రమాణాలకు తగినట్టుగా భారతీయ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిచేలా అయలాన్ సినిమాను నిర్మించాం. అత్యధిక వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ షాట్స్ ఉన్న చిత్రమిది. దాంతో ఈ సినిమా నిర్మాణంలో ఎలాంటి రాజీ పడలేదు. మా కష్టాన్ని, తపనను గుర్తించిన తమిళ ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీ, నైజాంలో ఈ నెల 26 తేదీన విడుదలవుతున్నది అని కోటపాడి జే రాజేష్ చెప్పారు.

Ayalaan 6 days Expected Collections Worldwide: Telugu version Release date is here

అయలాన్ సినిమా వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 40 కోట్లు అయింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆంధ్రా, నైజాంలో 26వ తేదీన 500 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

తమిళంలో అయలాన్ సినిమా తొలి రోజు నా మాత్రంగానే 3.5 కోట్లు రాబట్టింది. అయితే తొలి రోజు కంటే గత ఐదుగు రోజులుగా కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద పెంచుకొంటూ పోతున్నది. ఈ సినిమా రెండో రోజు 5 కోట్ల నెట్, మూడో రోజు 5.65 కోట్లుె, నాలుగో రోజు 6.8 కోట్లు, ఐదో రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆరో రోజు 3 కోట్లకుపైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా తమిళంలోనే 30 కోట్ల నెట్, 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Ayalaan 6 days Expected Collections Worldwide: Telugu version Release date is here

అయలాన్ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాకు యూఎస్, యూకే, సింగపూర్ తదితర దేశాల్లో రిలీజైంది. ఈ సినిమా గత 5 రోజుల్లో 14 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. దాంతో ఈ సినిమా 64 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

నటీనటులు: శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇషా కొప్పికర్, సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు

సినిమాటోగ్రాఫర్: నీరవ్ షా
ఎడిటర్: రూబెన్
పోస్టర్ డిజైన్: గోపి ప్రసన్న
ప్రొడక్షన్ డిజైన్: టీ ముత్తురాజ్
వీఎఫ్ఎక్స్: బిజోయ్ ఆర్పుతరాజ్ (ఫాంటమ్ ఎఫ్ఎక్స్)
కాస్ట్యూమ్ డిజైన్: పల్లవి సింగ్, నీరజా కోన
కొరియోగ్రఫి: గణేష్ ఆచార్య, పరేష్ శిరోద్కర్, సతీష్ కుమార్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత: కోటపాడి జె. రాజేష్
దర్శకత్వం: ఆర్ రవికుమార్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X