Ayalaan Box Office Collections శివకార్తికేయన్ సినిమా బడ్జెట్ 80 కోట్లు.. రకుల్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే

తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ నటించిన చిత్రం అయలాన్. సంక్రాంతి పండుగ కానుకగా ఈ మూవీ తమిళనాడు, ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఆర్ రవి కుమార్ దర్శకత్వంలో కటపాడి జే రాజేష్, ఆర్డీ రాజా నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన చిత్రం జనవరి 12వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అయలాన్ సినిమా కథ విషయానికి వస్తే.. దుష్టబుద్ది కలిగిన సైంటిస్ట్ (శరద్ కేల్కర్) ప్రపంచాన్ని శాసించాలనే కోరికతో ప్రయోగాలు చేస్తుంటాడు. ఆయనకు సహ ఉద్యోగి (ఇషా కొప్పికర్) ప్రయోగాలకు సహాయం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఉద్యోగం కోసం ఓ గ్రామం నుంచి చెన్నైకి తమీజ్ (శివకార్తికేయన్) వస్తాడు. చెన్నైలో భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసిని కలుసుకొంటాడు. ఆ తర్వాత ఈ నలుగురి జీవితాల్లో ఎలాంటి మార్పులు మార్పులు సంభవించాయనేది సినిమా కథ.

Ayalaan Expected Box Office Collections Worldwide: Here is Rakul Preet Singh, Sivakarthikeyans GBOC

అయలాన్ సినిమాలో భారీగా విఎఫ్ఎక్స్‌కు పెద్ద పీట వేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా నమోదైంది. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని దాదాపుగా 80 కోట్ల రూపాయల బడ్డెట్‌‌తో నిర్మించారు. ఈ సినిమా సుమారుగా 40 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

అయలాన్ సినిమాకు భారీ క్రేజ్ లభించడంతో రికార్డుస్థాయిలో స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను తమిళనాడులో 1100 స్క్రీన్లు, కర్ణాటకలో 400 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగులో 400 స్క్రీన్లు రిలీజ్ చేయాలని అనుకొన్నారు. కానీ స్క్రీన్ల కొరత కారణంగా ఆంధ్రా, నైజాంలో రిలీజ్ చేయలేకపోయారు.

Ayalaan Expected Box Office Collections Worldwide: Here is Rakul Preet Singh, Sivakarthikeyans GBOC

తమిళనాడులో అయలాన్ సినిమాకు మధ్యస్తంగా ఆక్యుపెన్సీ నమోదు అయ్యాయి. ఈ సినిమా ఉదయం ఆటలకు 30 శాతం, మధ్యాహ్నం ఆటకు 35 శాతం, ఫస్ట్ షోకు 32 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నైలో, పాండిచ్చేరి, దిండిగల్, త్రిచి రాష్ట్రాల్లో ఈ చిత్రం 35 నుంచి 40 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది.

అయలాన్ ఫస్ట్ డే కలెక్షన్లు
అయలాన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు భారీ పోటీ మధ్య కూడా గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. ఇండియా వైడ్ 3.7 కోట్ల షేర్, 5.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా తమిళనాడులోనే 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో 1 కోటి నికరంగా, 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారుగా 8 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

శివ కార్తీకేయన్ రెండో రోజు కలెక్షన్లు
ఇక అయలాన్ సినిమా రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది. ఈ సినిమా ఇండియావైడ్ 3.25 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 6.45 కోట్లు , ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 7 కోట్ల వసూలు చేయవచ్చు అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X