మహేష్‌బాబుని మరవలేనంటున్న కెనడా భామ
ఇండియా వచ్చిన తర్వాత నేను చూసిన మొట్టమొదటి సినిమా 'పోకిరి'. మహేష్‌బాబు అందంగా ఉన్నాడు అనుకున్నాను. ఈలోగా మహేష్‌బాబు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలో ఆఫర్ వచ్చింది. ఓకే చేసి యాక్ట్ చేశాను. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇంతమంచి చిత్రం ద్వారా నా సినిమా కెరీర్ ఆరంభం కావడం ఆనందంగా ఉంది అని కెనడా భామ అయేషా షివ్ చెప్తోంది. 'బిజినెస్‌మేన్' చిత్రంలో కాజల్ స్నేహితురాలిగా వచ్చీ రాని తెలుగులో మాట్లాడే పాత్రను చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే మహేష్‌బాబు మంచి నటుడని, ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన సహకారం మరవలేనని చెప్పుకొచ్చింది. హీరోయిన్ కాజల్ తనని ఓ సిస్టర్‌లా ట్రీట్ చేసిందని అయేషా చెప్పారు.
ఇక ఈ చిత్రంలో ఆఫర్ ఎలా వచ్చిందో చెపుతూ...మా కాస్టింగ్ డెరైక్టర్ నన్ను పూరి జగన్నాథ్‌కి పరిచయం చేశారు. 'బిజినెస్‌మేన్'లోని కాజల్ స్నేహితురాలి పాత్రకు సూట్ అవుతానని ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సినిమా.. భాష తెలియదు. ఎలా ఉంటుందోనని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ యూనిట్ సభ్యులు అందించిన సహకారంతో నా టెన్షన్ మొత్తం పోయింది. ఈ చిత్రంలో నా పాత్రకు తెలుగు రాదు. ఇంగ్లిష్ మిక్సి చేసి, వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతుంటాను. ఈ పాత్రకు నన్నే డబ్బింగ్ చెప్పమన్నప్పుడు 'థ్రిల్' అయ్యాను. తెలుగు రాదు కాబట్టి చాలా కష్టపడ్డాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. డబ్బింగ్ చెప్పడంవల్ల నా పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది అంది. ఇక కెనడా, యూకెలో విడుదలైన 'బిజినెస్‌మేన్'ని తన స్నేహితులు చూసి, చాలా బాగా యాక్ట్ చేసినందుకు ప్రసంశించారని కూడా అయేషా అంది.


Click it and Unblock the Notifications











