twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో అంధాదూన్ కలెక్షన్ల సునామీ.. 250 కోట్లవైపు పరుగు.. నాన్ హాలీవుడ్‌ సినిమాల్లో రికార్డు

    |

    విలక్షణ దర్శకుడు శ్రీరాం రాఘవన్ రూపొందించిన అంధాదూన్ చిత్రం చైనా బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. గత 13 రోజులుగా వసూళ్ల సునామీని కురిపిస్తున్నది. చైనాలో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కడంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. బ్లాక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ది పియానో ప్లేయర్ అనే పేరుతో విడుదలైంది. ఏప్రిల్ 3వ తేదీన విడుదలై తొలి ఆట నుంచి భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. వివరాల్లోకి వెళితే..

    13 రోజుల్లోనే రూ.200 కోట్లు

    13 రోజుల్లోనే రూ.200 కోట్లు

    స్వదేశంలో థ్రిల్లర్‌గా తెరకెక్కిన అంధాదూన్ కేవలం 13 రోజుల్లోనే రూ.200 కోట్లు వసూలు చేసింది. చైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నమోదు చేసుకొన్నది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించిన ఈ చిత్రం చైనా సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటూ రూ.250 కోట్ల దిశగా పరుగులు పెడుతున్నది. ఈ సినిమాకు పెరుగుతున్న ఆదరణను చూస్తే రానున్న రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.

    చైనా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు

    చైనా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు

    చైనా సినీ చరిత్రలో అంధూదూన్ చిత్రం మరో రికార్డు సొంతం చేసుకొన్నది. చైనాలో నాన్ హాలీవుడ్ టాప్ 10 జాబితాలో ఈ చిత్రం ఒకటిగా చేరడం విశేషం. భారతీయ చిత్రానికి ఇలాంటి గౌరవం దక్కడంపై సినీ పండితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో చైనా మార్కెట్‌లో భారతీయ చిత్రాలు భారీగా వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే.

     థ్రిల్లర్‌కు అద్భుతమైన రెస్సాన్స్

    థ్రిల్లర్‌కు అద్భుతమైన రెస్సాన్స్

    చైనాలో అంధాదూన్ రికార్డు వసూళ్లపై హీరో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. ఆ నటుడిగా నాకు అద్భుతమైన సంతృప్తిని అందించింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం అంతకంటే ఆనందంగా ఉంది. స్వదేశంలో అద్భుతమైన రెస్పాన్ లభించినప్పుడు ఎంత థ్రిల్‌కు లోనయ్యానో.. అంతకంటే రెండితలు ప్రస్తుతం ఆనందం కలుగుతున్నది అని అన్నారు.

    సినిమాకు, భాషకు సరిహద్దులు లేవు

    సినిమాకు, భాషకు సరిహద్దులు లేవు

    భాషకు సరిహద్దులు లేవు చైనాలో అంధాదూన్ సినిమా విజయం నిరూపించింది. శ్రీరాం రాఘవన్ రూపొందించిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను సీట్లకు హత్తుకొని చూసేలా చేస్తున్నది. చైనాలో మా చిత్రం విజయం సాధించడం మాకు మరింత గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. అమీర్ ఖాన్ లాంటి అగ్ర నటుల సినిమాలకు ధీటుగా ఈ చిత్రం వసూళ్లను సాధించడం ప్రతిష్ట పెరిగేలా చేసింది అని సినీ పండితులను ప్రశంసలు కురిపిస్తున్నారు.

    English summary
    Sriram Raghavan’s smart thriller AndhaDhun has crossed the Rs 200-crore mark in just 13 days since its release in China, making it a blockbuster in the neighbouring country. The Ayushmann Khurrana-Tabu-Radhika Apte-starrer opened in cinemas there on April 3 under the title, The Piano Player. The black comedy finds its place in the top 10 list of all-time non-Hollywood, non-Chinese films in this market.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X