twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : ఎన్టీఆర్ 'బాద్‌షా' కలెక్షన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బాద్‌షా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ మొదటి వారం బాగున్నా..తర్వాత మెల్లిగా తగ్గిపోవటం మొదలయ్యాయని ట్రేడ్ టాక్. వీకెండ్స్ లో తప్ప మిగతా రోజుల్లో చెప్పుకోతగ్గ కలెక్షన్స్ లేవని అంటున్నారు. ఊహించిన విధంగా కామెడీ క్లిక్ కాకపోవటం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందులోనూ ఎన్టీఆర్ బాద్షా గెటప్ పేలలేదు. దాంతో సినిమా రేంజి తగ్గిపోయింది. పబ్లిసిటీ కూడా మొదటి ఓ రేంజిలో ఊపారు కానీ ఇప్పుడు తగ్గించేసారు.

    దానికి తోడు నితిన్ తాజా చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే కూడా ఈ చిత్రానికి పోటీగా మారింది. గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం భాక్సాఫీస్ వద్ద మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. దాని ఎఫెక్టు బాద్షా పై పడుతోంది. మరో ప్రక్క వెంకటేష్ షాడో సైతం విడుదల కు సిద్దమైంది. అది ఏ మాత్రం బాగున్నా బాద్షా మరింత క్షీణించే అవకాసం ఉందని ట్రేడ్ లో అంటున్నారు.

    అయితే 'బాద్ షా' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్ ఫెంటాస్టిక్ కలెక్షన్స్ సాధించింది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈచిత్రం అమెరికా బాక్సాఫీసు చార్ట్ లో టాప్ పొజిషన్ దక్కించుకుంది. 'బాద్ షా' చిత్రం రికార్డు స్థాయిలో అమెరికాలో 117 థియేటర్లలో విడుదలైంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, హిట్ టాక్, గుడ్ ఎంటర్టెనర్ అని మౌత్ టాక్ రావడంతో సినిమా బిజినెస్ ఊపందుకుంది. దీంతో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈచిత్రం తొలి వీకెండ్(గురు, శుక్ర, శని, ఆది) రూ. 5.70 కోట్లు ($10,45,192) వసూలు చేసింది.

    గతంలో 'గబ్బర్ సింగ్' మూవీ ఫస్ట్ వీకెండ్ రికార్డ్ రూ. 4.13 కోట్లను ($7,65,373) వసూలు చేయగా....'బాద్ షా' ఆ రికార్డును అధిగమించింది. అయితే 'బాద్ షా' చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రికార్డును మాత్రం బద్దలు కొట్టడంలో విఫలమైంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం 69 స్ర్కీన్లలో విడుదలై ఫస్ట్ వీకెండ్ రూ. 6.87 కోట్లు ($12,62,100) వసూలు చేసింది.

    శ్రీను వైట్ల మాట్లాడుతూ... ''దూకుడు తరవాత చేస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు బాగా పెరిగాయి. దాంతో నాపై ఒత్తిడి ఎక్కువైంది. 'బాద్‌షా' కోసం పడిన ఏడాది కష్టాన్ని మర్చిపోయేలా చేసింది... ప్రేక్షకుల స్పందన. నేను నమ్ముకున్న వినోదమే నాకు వరుస విజయాల్ని అందిస్తుంది. స్పందన తెలుసుకొని ఎన్టీఆర్‌ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.'' అన్నారు.

    English summary
    
 There is sudden drop in collections of the new movie “Baadshah”. Heavy openings took place everywhere due to the released in massive number of theaters throughout the world on April 05th. Just after 10 days collections were dropped heavily from all centres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X