కృష్ణా జిల్లాలో ఓ రేంజిలో ‘బాద్‌షా’ క్రేజ్

By Srikanya

హైదరాబాద్ : నందమూరి ఫ్యామిలీకి ముఖ్యంగా ఎన్టీఆర్ కు మొదటినంచీ కృష్ణా జిల్లా పెట్టని కోటలా ఉంటూ వస్తోంది. దాంతో ఎన్టీఆర్ చిత్రాలు అక్కడ ఓ రేంజిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం కృష్ణ జిల్లాలో ఎనభై థియోటర్స్ కు మించి విడుదల అవుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి మంచి రిపోర్ట్ ఉండటం,అక్కడ నందమూరి కుటుంబ అభిమానులు ఎక్కువగా ఉండటంతో 'బాద్‌షా'కి విపరీతమైన క్రేజ్ ఆ జిల్లాలో ఏర్పడింది.

ఎన్టీఆర్, కాజల్ జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'బాద్‌షా' చిత్రం ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, యు/ఏ సర్ట్ఫికెట్ పొందింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఏ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు మెచ్చుకోవడం ఆనందంగా వుందని, ఈ వేసవి సీజన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా బాద్‌షా నిలబడతాడని, ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన ఆదరణ లభించడం కూడా చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారనుందని, సంగీతంతోపాటు కెమెరా పనితనం కూడా చిత్రానికి హైలెట్ అని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ గత చిత్రాలకన్నా ఈ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా వుంటుందని, ఎన్టీఆర్ నటన హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందని దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. 50 మంది ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక వర్గంగా కె.వి.గుహన్, గోపీమోహన్, కోన వెంకట్, థమన్ ఎస్.ఎస్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు పనిచేశారు. చిత్రానికి నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X