twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ లో ఎన్టీఆర్ ‘బాద్‌ షా’ పండుగ

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్ గా హీరోగా నటించి, ఈ వారంలో (ఏప్రియల్ 5) న విడుదల అవుతున్న చిత్రం 'బాద్‌ షా'. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ లో వంద థియోటర్స్ కి పైగా మొదటి రోజు విడుదల అవుతోంది. ఇన్ని థియోటర్స్ విడుదల అవటం ఓ రికార్డ్ అంటున్నారు. ఆ రోజు హైదరాబాద్ సిటీలో 'బాద్‌ షా' పండగ వాతావరణం నెలకొని ఉంటుందంటున్నారు. ఆ రోజు ఎక్కడ చూసినా,విన్నా 'బాద్‌ షా' గురించే వినపడే అవకాసం ఉంది.

    బండ్ల గణేష్ ఈ చిత్రం విడుదలపై మాట్లాడుతూ..... "శ్రీను వైట్ల చిత్రం బాద్‌ షా చిత్రం ఏప్రియల్ 5 న భారీగా విడుదల అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రం అవుట్ పుట్ విషయమై నేను చాలా ఆనందంగా ఉన్నాను. " అన్నారు.

    'బాద్‌ షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్‌ షా' విడుదలకు సిద్దమవుతోంది. శ్రీను వైట్ల మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగిన కథ ఇది. యాక్షన్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్‌ పాత్రని తెరపై ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటుంది. అనే సంభాషణలు అభిమానుల్ని ఆకట్టుకొంటాయి.'' అన్నారు.

    అలాగే ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    NTR’s ‘Baadshah’ is gearing up for a massive release on April 5th in a massive way. The film is getting more than a 100 screens in Hyderabad on Day 1 and the final list has not been frozen yet. NTR will be seen in a new avatar in this film and his dances for two songs are said to be superb. Thaman has composed the film’s music album and the audio has already become popular among movie lovers. Kajal Aggarwal is the heroine in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X