twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్‌ షా’ హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంతకంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'బాద్ షా' ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ గోల్డ్ మైన్స్ కు చెందిన మనీష్ వారు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు చెల్లించి తీసుకున్నట్లు సమచారం. నాయక్ చిత్రం మూడున్నర కోట్లకు గతంలో అమ్ముడుపోయినట్లు చెప్పారు.

    ఇక టీవీ రైట్స్ విషయంలో మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం టీవీ రైట్స్ విషయంలో టాలీవుడ్లో చరిత్రలో సెకండ్ బెస్ట్ ప్రైస్ రాబట్టిందని సమాచారం. 'బాద్‌ షా'పై భారీ అంచనాలు ఉండటంతో పలు టీవీ ఛానల్స్ ఈ చిత్రం హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. చివరగా జెమినీ టీవీ వారు రూ. 8 కోట్లు చెల్లించి ఈచిత్రం హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్-వెంకీ కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి అత్యధికంగా రూ. 8.5 కోట్లు టీవీ రైట్స్ రూపేణ వచ్చాయి.

    మరో ప్రక్క విడుదలకు ముందే సినిమాపై ఈ రేంజిలో హైప్ రావడంతో తమిళ స్టార్ హీరో విజయ్ కన్ను 'బాద్‌ షా' పై పడింది. వెంటనే ఈ చిత్ర నిర్మాత గణేష్‌ను 'పివిపి పిక్చక్స్' ద్వారా సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. విజయ్ గతంలో అనేక తెలుగు సినిమాల రీమేక్‌లలో నటించారు. ఆయన కెరీర్లో వచ్చిన హిట్ సినిమాల్లో తెలుగు సినిమాల రీమేకులే ఎక్కువ.

    'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Jr Ntr’s forthcoming movie ‘Baadshah’ directed by Srinu Vytla, Hindi dubbing rights were bagged by Manish of Gold Mines for a huge price of Rs.3.25 crores. It is second record after Ram Charan’s ‘Nayak’ which was sold for Rs.3.50 crores. ‘Baadshah’ is produced by Bandla Ganesh under the banner Sri Venkateswara creations. Actress Kajal Agarwal is playing lead role in the movie. Gopi Mohan and Kona Venkat were penned the script for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X