Coronavirus దెబ్బకు టైగర్ ష్రాఫ్ విలవిల.. భాగీ3కి ఊహించని షాక్
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రిలీజైన భాగీ3 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన సత్తాను చాటలేకపోతున్నది. ట్రైగర్ ష్రాఫ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను నమోదైన కలెక్షన్ల ప్రయాణం కరోనావైరస్ దెబ్బకు కుదేలైంది. గత ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

ఉత్తరభారతంలో కరోనా భయాలు
తొలి వారాంతం తర్వాత రూ.50 కోట్లు రాబట్టిన భాగీ3 చిత్రం ఆ తర్వాత నాలుగు రోజుల్లో నిలకడగా వసూళ్లు సాధించలేకపోయింది. తొలివారంలో రూ.100 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా..ఆ ఫీట్‌ను అధిగమించ లేకపోయింది. ఢిల్లీ, ఉత్తర భారతాన్ని కరోనా వైరస్ వణికించడమే ప్రధానమైన కారణమని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మహారాష్ట్రలో థియేటర్లలో మూసివేత
మహారాష్ట్ర ప్రభుత్వం కరోనావైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గురువారం సంచలన నిర్ణయం తీసుకొన్నది. ముంబై, నవీ ముంబై, పూణే, పింప్రి చించ్‌వాడ్, నాగ్‌పూర్‌లో థియేటర్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడం భాగీ3పై మరింత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ,, కర్ణాటక, బీహార్, ఒరిసాలోని ప్రభుత్వాలు థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.

తొలివారం కలెక్షన్లు
భాగీ తొలివారం కలెక్షన్లు ఇలా నమోదయ్యాయి. శుక్రవారం రూ.17.50 కోట్లు, శనివారం రూ.16.03 కోట్లు, ఆదివారం రూ.20.30 కోట్లు, సోమవారంరూ.9.06 కోట్లు, మంగళవారం రూ.14.05 కోట్లు, బుధవారం రూ.8.03 కోట్లు, గురువారం రూ.5.7 కోట్లు, శుక్రవారం రూ.1.5 కోట్ల మేర వసూళ్లు నమోదయ్యాయి. దీంతో తొలివారానికి ఈ చిత్రం రూ.90 కోట్లు మాత్రమే బాక్సాఫీస్ నుంచి రాబట్టింది.

ఓవర్సీస్ వసూళ్లు ఇలా..
ఇక భాగీ ఓవర్సీస్ రిపోర్టు చేస్తే.. అమెరికా, కెనడాలో ఈ చిత్రం 670వేల డాలర్లు, యూఏఈ, జీసీసీలో 1.2 మిలియన్ డాలర్లు, యూకేలో 292 వేల డాలర్లు, ఆస్ట్రేలియాలో 208 వేల డాలర్లు, రెస్టాఫ్ వరల్డ్ 560 వేల డాలర్లను నమోదు చేసింది. దాంతో ఓవర్సీస్‌లో 2930 డాలర్లు అంటే 21.63 కోట్లు గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











