»   » బాహుబలి 17 రోజుల్లో రూ. 436 కోట్లు! (ఏరియా వైజ్ డీటేల్స్)

బాహుబలి 17 రోజుల్లో రూ. 436 కోట్లు! (ఏరియా వైజ్ డీటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. మూడోవారంలోనూ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతూ దూసుకెలుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో బాహుబలి థియేటర్లు కళకళలాడుతున్నాయి.

తొలి 17 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిసి ‘బాహుబలి' చిత్రం రూ. 128 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ మొత్తంలో థియేటర్ ఖర్చులు, ఇతర వ్యయాలు పోను రూ. 92.53 కోట్ల షేర్ డిస్ట్రిబ్యూటర్లకు లభించినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇదో రికార్డు.


బాహుబలి హిందీ వెర్షన్ 17 రోజుల్లో రూ. 85.71 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బాలీవుడ్లో బాహుబలి సినిమా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు సాధించడం రికార్డ్.


ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో ‘బాహుబలి' ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా, అన్ని బాషల్లో కలిపి రూ. 436.1 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అయితే ఇందులో ఎంత షేర్ వచ్చింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. బాహుబలి 17 రోజుల గ్రాస్ కలెక్షన్ ఏరియా వైజ్...


ఆంధ్ర రీజియన్

ఆంధ్ర రీజియన్

బాహుబలి సినిమా ఆంధ్రా రీజీయన్ (ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణ, నెల్లూరు)లో ఇప్పటి వరకు రూ. 55 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.


నైజాం

నైజాం

నైజాం రీజియన్లో బాహుబలి సినిమా 17 రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో బాహుబలి సినిమా ఇప్పటి వరకు రూ. 23 కోట్ల గ్రాస్ సాధించింది.


యూఎస్ఏ/కెనడా

యూఎస్ఏ/కెనడా

బాహుబలి సినిమా ఇప్పటి వరకు ఇక్కడ రూ. 48 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.


కర్ణాటకలో

కర్ణాటకలో

బాహుబలి సినిమా కర్ణాటకలో రికార్డు స్థాయిలో రూ. 56 కోట్ల గ్రాస్ సాధించింది.


తమిళనాడు

తమిళనాడు

తమిళనాడులో బాహుబలి చిత్రం రూ. 58 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.


కేరళ

కేరళ

బాహుబలి సినిమా కేరళలో రూ. 8.6 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియాలో బాహుబలి చిత్రం ఇప్పటి వరకు రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.


ఇతర దేశాల్లో..

ఇతర దేశాల్లో..

బాహుబలి సినిమా ఇతర దేశాల్లో రూ. 17 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.English summary
Baahubali storm continues to amuse trade analysts while it emerged to be the India's biggest blockbuster after its successful third weekend. While it stands in the third place considering the World wide collections of any Indian movie, after the film collecting 436.1 Cr gross, including all the languages.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu