»   » బాహుబలి-2 బడ్జెట్ ఎంత? నిర్మాతలకు లాభం ఎంత?

బాహుబలి-2 బడ్జెట్ ఎంత? నిర్మాతలకు లాభం ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంట అది 'బాహుబలి' మాత్రమే. రెండు పార్టులు కలిసి రూ. 200 నుండి 250 కోట్లలో సినిమాను పూర్తి చేయాలనే ఎస్టిమేషన్స్ తో సినిమా ప్రారంభించారు.

'బాహుబలి-ది బిగినింగ్' ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 650 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మొదటి భాగం భారీ విజయం సాధించడం, భారీ వసూల్లు రాబట్టడంతో రెండో భాగం 'బాహుబలి-ది కంక్లూజన్' పై నిర్మాతలు ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే ఖర్చు పెట్టారని తెలుస్తోంది.

బాహుబలి-2 కు ఎంత ఖర్చు పెట్టారు?

బాహుబలి-2 కు ఎంత ఖర్చు పెట్టారు?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క బాహుబలి-2 సినిమా కోసం నిర్మాతలు రూ. 243 కోట్లు ఖర్చు చేసారని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే రెండో పార్టకు 150 కోట్ల కంటే బడ్జెట్ మించకూడదు. అయితే సినిమాకు అదనపు హంగులు అద్దడానికి, విజుల్ క్వాలిటీ మరింతగా పెంచడానికి దాదాపుగా మరో 100 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారన్నమాట.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

బాహుబలి-2 చిత్రానికి ఇప్పటి వరకు రూ. 500 కోట్లపైనే ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్, ఇతర రైట్స్ అన్నీ కలిపి లాభాలు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

1000 కోట్లు టార్గెట్

1000 కోట్లు టార్గెట్

బాహుబలి పార్ట్-1 రూ. 650 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో పార్ట్-2 రూ. 1000 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేస్తుందనే అంచనాతో ఉన్నారు. అందుకు తగిన విధంగానే సినిమాను భారీగా రిలీజ్ చేసేందకు ప్లాన్ చేస్తున్నారు.

‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

‘బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

ఈ మధ్య కాలంలో లీక్ వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ముందే సినిమాలోని క్లిప్స్ లీక్ కావడం, స్టోరీ లీక్ కావడం, కొన్ని సార్లు సినిమా మొత్తం లీక్ కావడం లాంటివి జరుగుతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతంగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో అత్యంత వేగంగా ఈ లీక్ స్టఫ్ అందరికీ షేర్ అవుతోంది. తాజాగా బాహుబలి-2 కథ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. వాట్సాఫ్, ఫేస్ బుక్ ద్వారా ఇది వైరల్ అయింది.

అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
According to a source, About Rs 243 crore has been spent on 'Baahubali: The Conclusion' alone. Producers weren't complaining as the pre-release business crossed Rs 500 crore with the sale of Theatrical & Satellite Rights of Indian versions alone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu