twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర సృష్టించనున్న బాహుబలి.. 1000 కోట్ల వసూలు చాలా ఈజీ.. ఇదిగో వివరాలు..

    భారీ అంచనాలతో వస్తున్న బాహుబలి2 చిత్రం భారతీయ బాక్సాఫీస్ చరిత్రను తిరుగరాసే అవకాశం ముందనే అప్పుడే ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. దేశంలోనే రూ.1000 కోట్లు వసూలు చేసే తొలి చిత్రంగా బాహుబలి2

    By Rajababu
    |

    ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది కన్‌క్లూజన్ మానియా మొదలైంది. ఇప్పటికే తొలివారం అడ్వాన్స్ బుకింగ్ క్లోజైంది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది బాహుబలి2ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చింది అని మదిని తొలుస్తున్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడానికి ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. భారీ అంచనాలతో వస్తున్న బాహుబలి2 చిత్రం భారతీయ బాక్సాఫీస్ చరిత్రను తిరుగరాసే అవకాశం ముందనే అప్పుడే ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. దేశంలోనే రూ.1000 కోట్లు వసూలు చేసే తొలి చిత్రంగా బాహుబలి2 నిలువనున్నదనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. చరిత్ర సృష్టించడానికి కారణమయ్యే ప్రధాన అంశాలు ఇవే.

    భాషలకతీతంగా..

    భాషలకతీతంగా..

    భాషకతీతంగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఒప్పించడంలో దర్శకుడు రాజమౌళి బాహుబలిని తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యారు. 2015లో వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా సినీ అభిమానులను ఒక్కటి చేసింది. ఊహలకు అందకుండా రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి1 చూసిన వారికి, చూడని వారికి బాహుబలి2 చూడాలనే తపన మొదలైంది. ఈ మానియా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ రాష్ట్రాల్లో కూడా జోరుగా కనిపిస్తున్నది.

    సెట్టింగులు, టెక్నాలజీ

    సెట్టింగులు, టెక్నాలజీ

    బాహుబలి సిరీస్‌లో బాహుబలి, భళ్లాలదేవ, శివగామి, కట్టప్ప లాంటి పాత్రలను దర్శకుడు రాజమౌళి మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అద్భుతమైన సెట్టింగులు, హంగులు, టెక్నాలజీ లాంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. అవే బాహుబలి చిత్రానికి బలమైన అంశాలుగా మారాయి. ఇలాంటి అంశాలన్నే భారీ కలెక్షన్లు సాధించడానికి దోహదపడుతున్నాయి.

    బ్రాండ్ రాజమౌళి..

    బ్రాండ్ రాజమౌళి..

    తాను గొప్ప దర్శకుడిని కాదని గతంలో ఎన్నోసార్లు చెప్పుకొన్నారు. కానీ ఆయన తీసిన మగధీర, ఈగ చిత్రాలు దేశంలోనే ఆయనను గొప్ప దర్శకుడిగా చేశాయి. సినిమా ఎలా ఉండాలి? పాత్రల రూపకల్పన తదితర అంశాలను తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి అని గత చిత్రాలు, బాహుబలి నిరూపించాయి. ఈగను పెట్టి సినిమా తీసిన ధైర్యం ఆయనకే చెల్లింది. సమకాలీన దర్శకుల్లో గొప్పగా కథ చెప్పడంలో రాజమౌళిది ప్రత్యేకమైన శైలి.

    యాక్షన్ ప్రధానాయుధం

    యాక్షన్ ప్రధానాయుధం

    యాక్షన్‌ను మేలివించి పౌరాణిక చిత్రాలు, చారిత్రక సినిమాలు రూపొందించి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రాజమౌళిది అందె వేసిన చెయ్యి. సినిమాను గ్రాండ్, రిచ్‌గా తీయడంలో ఆయనను మించిన వారు దారిదాపుల్లో కనిపించరు. ఇవన్నీ ప్రేక్షకుడిని మరోమారు ఆలోచించకుండా థియేటర్‌కు లాక్కొస్తాయి.

    థియేటర్ల సంఖ్య

    థియేటర్ల సంఖ్య

    బాహుబలి ది కన్ క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9000 థియేటర్లలో విడుదలవుతున్నది. ఇంత మొత్తంలో ఓ ప్రాంతీయ చిత్రం రిలీజ్ కావడం సినీ చరిత్రలోనే మొదటిసారి. దాంతో బాహుబలి మొదటి రోజునే సుమారు రూ.70 కోట్లు ఉండే అవకాశం ఉంది. ట్రైలర్‌ను దాదాపు 100 కోట్ల మందికి పైగా చూశారంటే సినిమాను ఇంకా ఎక్కువ మంది చూడటం ఖాయం. దీంతో ఈ సినిమా రూ.1000 కోట్లు అతి సునాయసంగా వసూలు చేయడం తథ్యం అనే మాటను ట్రేడ్ అనలిస్తులు చెప్తున్నారు.

    మార్కెటింగ్ స్ట్రాటెజీ

    మార్కెటింగ్ స్ట్రాటెజీ

    ఇటీవల కాలంలో మార్కెటింగ్ స్ట్రాటెజీలో కబాలీ ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎయిర్ ఆసియా విమానం డిజైనింగ్, సిల్వర్ కాయిన్లు డిజైన్ నుంచి ఎన్నో రకాలుగా మార్కెటింగ్ పద్దతులను ఉపయోగించారు. ఇలాంటి అంశాలను మించి బాహుబలి2 మార్కెటింగ్ స్ట్రాటెజీని చేపట్టింది. బాహుబలి2 ప్రమోషన్‌లో భాగంగా వివిధ రకాల ఉత్పత్తులు కాంటెస్టులు ప్రారంభించాయి. ది రైజ్ ఆఫ్ శివగామి పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు.

    సరికొత్త టెక్నాలజీ..

    సరికొత్త టెక్నాలజీ..

    బాహుబలి2 సాంకేతికంగా మరో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిన మూడో చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది. అమెరికాలో 40 ఐమాక్స్ స్క్రీన్లలో విడుదల అవుతున్నది. ఇంకా ఐమాక్స్ థియేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా వర్చువల్ రియాల్టీ టెక్నాలజీలో ఈ సినిమాను విడుదల చేసి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించేందుకు సిద్ధమయ్యారు.

    తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ షోలు.

    తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ షోలు.

    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఐదు లేదా ఆరు షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. ఓ తెలుగు సినిమా సింగిల్ థియేటర్‌లో ఒకే రోజు ఇన్ని షోలు ప్రదర్శించడం తొలిసారి కావొచ్చు. ఇవన్నీ కలెక్షన్లు పెంచడానికి దోహదపడుతాయి.

    English summary
    Economically speaking, films like Baahubali is important for the Indian film industry, to scale newer heights. India is a country that is so obsessed with films. Baahubali 2 should do a business somewhere between Rs 60- 70 crore on its opening day. As per the trade estimates, Baahubali 2 is likely to gross Rs 1000 crore since the trailer has received an overwhelming response from fans, garnering more than 100 million views on YouTube.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X