ప్రి రిలీజ్ బిజినెస్: బాహుబలి పార్ట్-1, పార్ట్-2కి కోట్లలో తేడా, ఇదిగో లెక్కలు...

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్-2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

By Bojja Kumar

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్-2 మరో నాలుగు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో... ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

పార్ట్ 1తో పోల్చుకుంటే..... పార్ట్ 2కు అన్ని ఏరియాల్లో దాదాపు రెట్టింపు బిజినెస్ జరిగింది. తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు.

ఏరియాల వారిగా పరిశీలిస్తే సినిమా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివిరాలు ఇలా ఉన్నాయి....

నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో పార్ట్-1 రిలీజ్ సమయంలో రూ. 23 కోట్లకు అమ్ముడవ్వగా..... పార్ట్ 2 ను రూ. 45 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ లో తీసుకున్నారు.

సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాకుగాను పార్ట్ 1 సమయంలో రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వగా.... పార్ట్ 2 దాదాపు అంతకు రెట్టింపు రూ. 25 కోట్లకు అమ్ముడు పోయింది.

వైజాగ్ ఏరియా

వైజాగ్ ఏరియా

వైజాగ్ ఏరియాలో బాహుబలి పార్ట్ 1 అప్పట్లో రూ. 7 కోట్లకు అమ్ముడవ్వగా..... తాజాగా పార్ట్ 2 రూ. 14 కోట్లకు అమ్ముడు పోయింది.

ఈ స్ట్ గోదావరి

ఈ స్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో పార్ట్ 1 సమయంలో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తాజాగా పార్ట్ 2 చిత్రానికి రూ. 11 కోట్ల బిజినెస్ జరిగింది.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి పార్ట్ -1 సమయంలో రూ. 4.5 కోట్లకు అమ్ముడు పోయింది. తాజాగా పార్ట్ -2 బిజినెస్ రూ. 9.5 కోట్లు జరిగింది.

గుంటూరు ఏరియా

గుంటూరు ఏరియా

గుంటూరు ఏరియాకు పార్ట్-1 సమయంలో రూ. 6 కోట్ల బిజినెస్ జరుగ్గా.... తాజాగా పార్ట్ 2 విషయంలో 12 కోట్ల బిజినెస్ జరిగింది.

కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాకుగాను పార్ట్ 1 విషయంలో రూ. 4 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమాపై క్రేజ్ బాగా ఉండటంతో ఈ సారి పార్ట్ 2 రూ. 9 కోట్లకు అమ్ముడు పోయింది.

నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాకు పార్ట్ 1 విషయంలో రూ. 3.5 కోట్ల బిజినెస్ జరిగింది. తాజాగా పార్ట్ 2 రూ. 5.5 కోట్లకు అమ్ముడు పోయింది.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 130 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో రూ. 130 కోట్లు

బాహుబలి 2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో రూ. 130 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక బాక్సాఫీసు వద్ద తెలుగులో రూ. 200 కోట్ల పైచిలుకు బిజినెస్ జరుగుతుందని అంచనా.

బాహుబలి 2 మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు

బాహుబలి 2 మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాలు

మహాభారతంపై రాజమౌళి క్లారిటీ: మోహన్ లాల్ 1000 కోట్ల ప్రాజెక్టుపై స్పందన!, బాహుబలి 2లో రాజమౌళి కూతురు కూడా నటిస్తోంది..., అందర్నీ డార్లింగ్ అనే ప్రభాస్.... రాజమౌళి భార్యను ఏమనేవాడో తెలుసా?, రోజుకు 6 షోలు: బాహుబలి 2 కోసం ప్రత్యేక అనుమతి!.... ఇలా మరిన్ని విశేషాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X