»   » అమెరికా రిపోర్ట్: హాలీవుడ్ సినిమాలతో ‘బాహుబలి’ పోటీ

అమెరికా రిపోర్ట్: హాలీవుడ్ సినిమాలతో ‘బాహుబలి’ పోటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు రాబడుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం ఈ వారం యూఎస్ఏ టాప్-10 హయ్యెస్ట్ గ్రాసింగ్ లిస్టులో చోటు దక్కించుకుంది.

న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం... బాహుబలి అక్కడ ఈ వారం 9వ స్థానంలో ఉంది. జూరాసిక్ వరల్డ్, టెర్మినేటర్, ఇన్ సైడ్ ఔట్ లాంటి సినిమాలతో పోటీ పడుతూ టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకుంది. వీకెండ్ తో పాటు సోమవారం కూడా ‘బాహుబలి' కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఇప్పటికే 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘బాహుబలి' త్వరలోనే 6 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.


Baahubali competing with Hollywood biggies like Jurrasic World, Terminator

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్లు రూ. 200 కోట్ల మార్కును దాటింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ మార్కును అందుకున్న తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి' రికార్డులకెక్కింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం ఇలా అన్ని బాషల్లోనూ ‘బాహుబలి' సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెలుతోంది.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి రెండు భాగాలు కలిపి రూ. 250 కోట్లతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం విడుదలైన తొలి భాగా ‘బాహుబలి-ది బిగినింగ్' అంచనాలకు మించిన వసూళ్లు సాధిస్తోంది. రెండో భాగం 2016లో విడుదల కాబోతోంది.

English summary
According to the latest report by the Newyork Times, Baahubali is currently in the 9th position and competing with Hollywood biggies like Jurrasic World, Terminator, Inside Out and few others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu