»   » ‘బాహుబలి’.... నైజాంలో 20 కోట్లు క్రాస్ అయింది

‘బాహుబలి’.... నైజాంలో 20 కోట్లు క్రాస్ అయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెలుతోంది. కలెక్షన్ల పరంగా టాలీవుడ్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

తాజాగా ‘బాహుబలి' చిత్రం నైజాం ఏరియాలో రూ. 20 కోట్ల(షేర్) మార్కును అధిగమించింది. తొలి 6 రోజుల్లోనే బాహుబలి ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇప్పటి వరకు నైజాం ఏరియాలో ఇంత ఫాస్ట్ గా రూ. 20 కోట్లు వసూలు చేసిన సినిమా ఇదే కావడం విశేషం. నైజాం కలెక్షన్ల వివరాలు రోజు వారీగా ఇలా ఉన్నాయి.


Baahubali crosses 20 Cr mark in Nizam

శుక్ర వారం: 6.22 కోట్లు
శనివారం: 3.55 కోట్లు
ఆదివారం: 3.65 కోట్లు
సోమవారం: 2.82 కోట్లు
మంగళవారం: 2.20 కోట్లు
బధవారం: 2.20 కోట్లు
టోటల్ 6 రోజుల్లో: 20.64 కోట్లు


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి రెండు భాగాలు కలిపి రూ. 250 కోట్లతో తెరకెక్కింది. ప్రస్తుతం విడుదలైన తొలి భాగా ‘బాహుబలి-ది బిగినింగ్' అంచనాలకు మించిన వసూళ్లు సాధిస్తోంది. రెండో భాగం 2016లో విడుదల కాబోతోంది.

English summary
Baahubali crosses 20 Crore mark in Nizam. As per the latest update, it has collected 2.20 crores on Wednesday and surpassed 20 Crore mark in this region.
Please Wait while comments are loading...