»   »  రూ. 500 కోట్లు...‘బాహుబలి’ సరికొత్త రికార్డ్

రూ. 500 కోట్లు...‘బాహుబలి’ సరికొత్త రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ సరికొత్త మైలు రాయిని అందుకుంది. ప్రముఖ ఆంగ్లపత్రిక హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం రూ. 500 కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ రేంజిలో కలెక్షన్లు సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఫోర్బ్స్ కథనం ప్రకారం...ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి. హిందీయేతర సినిమాలు రూ 500 మార్కును అందుకున్న దాఖలాలు భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు లేనేలేదు. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3, పికె చిత్రాలు మాత్రమే రూ. 500 కోట్ల మార్కును అందుకున్నాయి.


'Baahubali' crosses Rs.500-crore mark

బాహుబలి సినిమా నాలుగో వారంలోనూ ప్రపంచ వ్యాప్తంగా 2000లకు పైగా స్క్రీన్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. సినిమాకు విడుదలైన ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా గురించి షారుక్ ఖాన్ ట్విట్టర్లో ఓ ట్వీట్ కూడా చేసారు.‘బాహుబలి' తొలి భాగం చూసిన ప్రేక్షకులు.... రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తయింది. మిగతా షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. 2016లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


English summary
SS Rajamouli's masterpiece Baahubali has shot past the Rs. 500-crore record on Sunday, according to a Hindustan Times report.
Please Wait while comments are loading...