»   » బాహుబలి... తొలి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా?

బాహుబలి... తొలి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీసు వద్ద అంచనాలకు మించిపోయింది. తొలి రోజు ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఆంద్రప్రధేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు అన్ని ఖర్చులు పోను రూ. 24 కోట్ల షేర్ సాధించింది తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.

రాజమౌళి అండ్ టీం గత రెండు మూడేళ్లుగా పడ్డ కష్టానికి తగిన ఫలితాలు వస్తుండటంతో అంతా ఆనందంగా ఉన్నారు. ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని నిరూపించారని సినిమా చూసిన వారు కొనియాడుతున్నారు.


Baahubali first day collection 24 cr

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
According to the latest report, Baahubali has collected a total share of close to 24 crores in the two Tekugu states on the first day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu