»   » వసూళ్లు అదిరాయ్: బాహుబలి ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్

వసూళ్లు అదిరాయ్: బాహుబలి ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. జులై 10న విడుదలైన ఈ చిత్రం గురువారంతో ఫస్ట్ వీక్ పూర్తయింది. ఈ వారం రోజుల్లో వసూళ్లు ఘనంగా రాబట్టింది. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఏ సినిమాకు లేనంతగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడంతో పాటు బాలీవుడ్లో నూ దుమ్ము దులుపుతోంది. ప్రపంచ స్థాయిలో బాహుబలికి గుర్తింపు లభించింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి వారం దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

Baahubali first week collections

ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఏపీ-తెలంగాణలో థియేటర్ల రెంటు, ఇతర ఖర్చులు పోగా మిగిలి షేర్ వివరాలు ఏరియావైజ్...


నైజాం: రూ. 22. 54 కోట్లు
సీడెడ్: రూ. 12.00 కోట్లు
నెల్లూరు: రూ. 2.25 కోట్లు
గుంటూరు: రూ. 5.48 కోట్లు
కృష్ణ: రూ. 3.65 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 4.54 కోట్లు
ఈస్ట్ గోదావరి: రూ. 5.28 కోట్లు
వైజాగ్: రూ.5.53 కోట్లు
ఏపీ-తెలంగాణలో టోటల్ ఫస్ట్ వీక్ షేర్: 61.27 కోట్లు


బాలీవుడ్లో కూడా బాహుబలి కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. అక్కడ ఫస్ట్ వీక్ షేర్ రోజుల వారిగా వివరాలు...


శుక్రవారం: రూ. 5.15 కోట్లు
శనివారం: రూ. 7.09 కోట్లు
ఆదివారం: రూ. 10.11 కోట్లు
సోమవారం: రూ. 6.10 కోట్లు
మంగళవారం: రూ. 6.15 కోట్లు
బుధవారం: 6.05 కోట్లు
గురువారం: 6.12 కోట్లు
టోటల్ బాలీవుడ్ ఫస్ట్ వీక్ షేర: రూ. 46.77 కోట్లు


కర్ణాటకలో ఏకంగా తొలి వారం రూ. 20 కోట్ల షేర్ వసూలు చేసింది


ఓవర్సీస్
ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి ఐదురోజుల్లో 4.7 మిలియన్ డాలర్లు(రూ. 29 కోట్లు)వసూలు చేసింది. ఫస్ట్ వీక్ రూ. 35 కోట్లు వసూలు చేసిందని అంచనా. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. తమిళం, మలయాళం కలెక్షన్ల వివరాలు ఇంకా తెలియలేదు.

English summary
India’s biggest motion picture,Baahubali, is scaling new heights at the box office. The worldwide gross has surpassed 250 Crores and it has toppled many Bollywood biggies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu