»   » ‘బాహుబలి': హిందీ శాటిలైట్స్ రేటు ఎంతో తెలుసా?

‘బాహుబలి': హిందీ శాటిలైట్స్ రేటు ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబలి' మొన్న శుక్రవారం నాడు... భారీ ఓపినింగ్స్ తో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ సైతం అదే రోజు విడుదలైంది. ఈ నేపధ్యంలో బాహుబలి..హిందీ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయనే వార్త బయటకు వచ్చింది. మరి ఈ స్ధాయి క్రేజ్ తెచ్చుకున్న చిత్రం శాటిలైట్ రైట్స్ ఎంతకు అమ్ముడవుతాయి...అంటే 17 కోట్లకు బాలీవుడ్ సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ శాటిలైట్ రైట్స్ ని సోనీ టెలివిజన్ సొంతం చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ ఏ ఇతర డబ్బింగ్ చిత్రం ఈ స్దాయి రేటు ని అందుకోలేదు. గతంలో వచ్చిన రాజమౌళి చిత్రం ఈగ కు సైతం హిందీ శాటిలైట్ రైట్స్ 8 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ఇది రికార్డు స్దాయి అని చెప్పుకుంటున్నారు.


మరో ప్రక్క


Baahubali Hindi Satellite Rights Price

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే స్థాయిలో హాలీవుడ్ రేంజి సినిమా తీసిన దర్శకుడు రాజమౌళికి అన్ని వైపుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. రాజమౌళి అండ్ టీం తమ సినిమా సాధిస్తున్న ఫలితాలు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు నుండి అందుతున్న ప్రశంసలతో దాదాపు మూడేళ్లుగా పడ్డ కష్టాన్ని మరిచిపోతున్నారు.


‘బాహుబలి' చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద కూడా తన సత్తా చాటుతోంది. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి' సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా సత్తా చాటింది.


ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ‘పికె' చిత్రం అక్కడ తొలి రోజు 0.97 మిలియన్ డాలర్లు(రూ. 6.15 కోట్లు) వసూలు చేసింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' పికె రికార్డును బద్దలు కొట్టింది.


‘బాహుబలి' సినిమా అమెరికా బాక్సాపీసు వద్ద తొలి రోజు ఏకంగా 1.30 మిలియన్ డాలర్లు(రూ. 8.24 కోట్లు) వసూలే చేసింది. ఈ సినిమా తొలి రోజే ఇంత భారీ మొత్తం వసూలు చేసిందంటే మున్ముందు ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Satellite rights of 'Baahubali' Hindi version were sold out for Rs 17 crore. Sony Television has bought the rights.
Please Wait while comments are loading...