»   » 3 వీక్స్... బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’

3 వీక్స్... బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' హిందీ వెర్షన్ బాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. బాలీవుడ్లో 100 కోట్ల మార్కును అందుకున్న తొలి సౌత్ ఇండియా మూవీగా ఈ చిత్రం రికార్డులకెక్కబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్స్ రూ. 95 కోట్లు క్రాస్ అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్ చేసారు.

ఈ మేరకు ఆయన వసూళ్ల వివరాలు వెల్లడించారు. బాలీవుడ్లో బాహుబలి వసూల్లు ప్రభంజనం ఇలా సాగింది...


జులై 10(శుక్రవారం): రూ. 5.15 కోట్లు
జులై 11: రూ. 7.09 కోట్లు
జులై 12: రూ. 10.11 కోట్లు
జులై 13: రూ. 6.10 కోట్లు
జులై 14: రూ. 6.15 కోట్లు
జులై 15: 6.05 కోట్లు
జులై 16: 6.12 కోట్లు
జులై 17: రూ. 3.25 కోట్లు
జులై 18: 4.70 కోట్లు
జులై 19: 5.40 కోట్లు
జులై 20: 3.82 కోట్లు
జులై 21: 3.20 కోట్లు
జులై 22: 3.05 కోట్లు
జులై 24: 3.10 కోట్లు
జులై 25: 4.35 కోట్లు
జులై 26: 5.11 కోట్లు
జులై 27: 3.05 కోట్లు
జులై 28: 2.60 కోట్లు
జులై 29: 2.25 కోట్లు
జులై 30: 2.15 కోట్లు


టోటల్ 3 వీక్స్ కలెక్షన్ : రూ. 95.76 కోట్లు


Baahubali Hindi version is eyeing 100 cr mark

ఇప్పటి వరకు ఏ సౌతిండియన్ సినిమా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించలేదు. బాలీవుడ్ రెగ్యులర్ సినిమాలతో సమానంగా అక్కడ బాహుబలి సినిమా ఆదరణ లభిస్తుండటం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్ వెర్షన్లు కలిపి బాహుబలి కలక్షన్స్ రూ. 500 కోట్ల మార్కను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం దేశీయ బాషలైన తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో మాత్రమే విడుదలైంది.


తాజాగా ఈచిత్రాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ వివిధ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చైనీస్ బాషతో పాటు ఇంగ్లీష్ బాషలోకి అనువదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కోట్లో ఈ చిత్రం మరో 100 కోట్లు ఈజీగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు.


ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాల ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఎడిటింగ్ తరువాత ఇంటర్నేషనల్ వర్షన్ విడుదలకు సిద్ధం కానుంది. 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', 'నౌ యూ సీ మీ', 'ద లెజెండ్ ఆఫ్ హెర్క్యులస్' వంటి పలు చిత్రాలకు విన్సెంట్ ఎడిటర్ గా పనిచేశారు.

English summary
"Baahubali [dubbed Hindi version] is eyeing 100 cr mark, which is HISTORIC. Sets a new BENCHMARK. Data follows of dubbed Hindi version...#Baahubali [dubbed Hindi version; Week 3] Mon 3.05 cr, Tue 2.60 cr, Wed 2.25 cr, Thu 2.15 cr. Total: ₹ 95.76 cr. ALL TIME BLOCKBUSTER" Taran Adarsh tweeted.
Please Wait while comments are loading...