‘బాహుబలి’ ఇంకో దేశంపై దండయాత్ర, అంతా సిద్దం
హైదరాబాద్ : భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన చిత్రం 'బాహుబలి' . తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించి, ఇతర దేశాల్లోనూ విడుదలై జయకేతనం ఎగురవేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 13న తైవాన్‌లో విడుదలై మంచి వసూళ్లను అందుకొంది.
మొన్నీమధ్య కేన్స్ చలనచిత్రోత్సవంలోనూ ప్రదర్శితమైంది. ఇప్పుడు పెరూలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26న అక్కడ 'బాహుబలి' విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆయా దేశాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ సాంకేతిక విలువలతో రూపొందడంతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొందింది. విదేశాల్లోని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.
పలు అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన 'బాహుబలి'కి చైనా, జపాన్, జర్మనీ, లాటిన్ అమెరికాలలో విడుదల చేసేంత రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకు వచ్చాయి. సినిమా నిడివిని సుమారు 20 నిమిషాలపాటు తగ్గించి, ఇంటర్నేషనల్ కాపీని సిద్ధం చేశారు.

ఓ వైపు మొదటి 'బాహుబలి' ప్రపంచ పర్యటన చేస్తుంటే మరోవైపు రెండో 'బాహుబలి' క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ కు వేసవి విరామం ఇచ్చిన రాజమౌళి 'బాహుబలి: ది కంక్లూజన్' షూటింగ్ పనులు ప్రారంభించేశారు.
'పతాక సన్నివేశాల షూటింగ్ కోసం కసరత్తులు చేస్తున్నాం' అంటూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది ఆ చిత్రబృందం. అందులో రాజమౌళి, ఛాయాగ్రాహకుడు సెంథిల్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











