»   » బాహుబలి.... రూ. 400 కోట్లు! ఏపీ, నైజాంలో ఎంత?

బాహుబలి.... రూ. 400 కోట్లు! ఏపీ, నైజాంలో ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా కలెక్షన్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల 23తో విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా మూడో వారంలోకి ఎంటరైంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి' సినిమా రూ. 391 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తియ్యేలోగా రూ. 400 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

తెలుగు నాట ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏపీ తెలంగాణల్లో కలిపి రెండు వారాల్లో రూ. 87.1 కోట్ల షేర్ సాధించింది.


Baahubali @ The 400 Crores

నైజాం: రూ. 32.09 కోట్లు
సీడెడ్: రూ. 17.7 కోట్లు
వైజాగ్: రూ. 7.49 కోట్లు
గుంటూరు: రూ. 7.80 కోట్లు
కృష్ణ: రూ. 5.44 కోట్లు
ఈస్ట్: రూ. 7.23 కోట్లు
వెస్ట్: రూ. 6.05 కోట్లు
నెల్లూరు: రూ. రూ. 3.30 కోట్లు


బాహుబలి పార్ట్ 1 విజయవంతం కావడంతో పార్ట్ 2 కోసం భారతీయ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి' పార్ట్ -2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై హీరో ప్రభాస్ స్పష్టత ఇచ్చారు. షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుందని తెలిపారు. పార్ట్ 2కు సంబంధించి షూటింగ్ 40 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది, యుద్ధం, ఇతర కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో సెకండ్ పార్ట్ రాబోతోంది. 2016లో ఈ సినిమా విడుదల కానుంది.స

English summary
Just within two weeks after its release at box office, Baahabali, the magnum opus created by SS Rajamouli, has collected nearly 391+ crores gross from the worldwide box office. Collecting 10 more crores in next two days isn't a big thing with this weekend seeing no other big release at box office. So, Baahubali is officially the only 400 Crore club Member in India for the now.
Please Wait while comments are loading...