»   » 6వేల ప్రింట్లతో చైనాపై ‘బాహుబలి’ దండయాత్ర!

6వేల ప్రింట్లతో చైనాపై ‘బాహుబలి’ దండయాత్ర!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. దేశీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ చిత్రం బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి తోసింది.

తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ‘బాహుబలి' మరో 100 కోట్లు రాబడుతుందని భావిస్తున్నారు. చైనీస్ బాషతో పాటు ఇంగ్లీష్ బాషలోకి అనువదించినట్లు సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేయించారు. ఈ స్టార్ ఫిలింస్ వారు 6వేల ప్రింట్లతో చైనాలో ఈ సినిమా మే నెలలో రిలీజ్ చేస్తున్నారు.


ప్రముఖ హాలీవుడ్ సినిమాల ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగిన విధంగా ఎడిట్ చేసారు.'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', 'నౌ యూ సీ మీ', 'ద లెజెండ్ ఆఫ్ హెర్క్యులస్' వంటి పలు చిత్రాలకు విన్సెంట్ ఎడిటర్ గా పనిచేశారు.


'Baahubali: The Beginning' to release in China with 6000 prints

చైనాలో ఇంత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే. ఇంతకు ముందు బాలీవుడ్ చిత్రం ‘పికె' చైనాలో భారీ ప్రింట్లతో రిలీజ్ అయి 100 కోట్లకుపైగా వసూలు చేసింది. ‘బాహుబలి' కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు.


ఇక రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి-2' షూటింగులో బిజీగా ఉన్నారు. బాహుబలి-2 షూటింగ్‌ను డిసెంబర్లో మొదలైంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనున్న రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో లేదా..2017లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
'Baahubali: The Beginning' Baahubali, directed by SS Rajamouli, will release in over 6000 screens in China by E Stars Films in May.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu