Baahubali: The Epic Collection: రీ రిలీజ్‌లో బాహుబలి విధ్వంసం.. వారం రోజుల్లో ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలతో సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. పాన్ ఇండియా మూవీ అన్న కల్చర్ బాహుబలితోనే మొదలైంది. బాహుబలి ది బిగిన్, బాహుబలి ది కన్‌క్లూజన్ అంటూ రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 2500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌లో బాహుబలిని కూడా రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ విషయంలోనూ జక్కన్న తన మార్క్ చూపించారు. రెండు పార్ట్స్ కలిపేసి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీ రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది ఈ చిత్రం. అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా రిలీజైన బాహుబలి ది ఎపిక్ వారం రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టింది? పరిశీలిస్తే..
బాహుబలి తారాగణం
బాహుబలి సిరీస్‌లో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజ్, అడవి శేష్, రోహిణి, కల్పలత, రోహిణి, తనికెళ్ల భరణి, ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించగా.. నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
బాహుబలి ది ఎపిక్‌కు ఇండియా వైడ్‌గా ప్రీమియర్స్‌తో 1.15 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలి రోజున 9.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 6.3 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.95 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయల చొప్పున 30.79 కోట్ల రూపాయల నెట్.. 35.37 కోట్ల రూపాయలు నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.
బాహుబలి ది ఎపిక్ ఓవర్సీస్ కలెక్షన్స్
బాహుబలి ది ఎపిక్‌కు నార్త్ అమెరికాలో వసూళ్లు వెల్లువెత్తాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి వారం రోజుల్లో ప్రభంజనం సృష్టించింది. 7వ రోజు రాత్రి 7 గంటల వరకు 11K ( భారత కరెన్సీలో 9.75 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో బాహుబలి ది ఎపిక్ 888K (భారత కరెన్సీలో 7.87 కోట్ల రూపాయలు) రాబట్టింది. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో మరో 5 కోట్ల రూపాయలు వచ్చింది. దాంతో వారం రోజుల వరకు ఓవర్సీస్ నుంచి బాహుబలి ది ఎపిక్‌కు 12 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి తొలి వారంలో బాహుబలి ది ఎపిక్‌కు వరల్డ్ వైడ్‌గా 47.37 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ది ఎపిక్ వసూళ్లు పరిశీలిస్తే... ప్రీమియర్స్‌లో 1.15 కోట్ల రూపాయలు, తొలి రోజున 7.9 కోట్ల రూపాయలు, రెండో రోజున 4.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.9 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.18 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.06 కోట్ల రూపాయలు, ఆరో రోజున 82 లక్షల రూపాయలు, ఏడో రోజున 50 లక్షల రూపాయలు చొప్పున వారం రోజుల్లో 21.54 కోట్ల రూపాయలు రాబట్టాడు ప్రభాస్. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో 10.65 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2.30 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 8.40 కోట్ల రూపాయలు వసూలు చేసింది బాహుబలి.
ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 21.54 కోట్ల రూపాయలు, హిందీలో 6.4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.22 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.82 కోట్ల రూపాయలు, కేరళలో 1.56 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 7.45 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ వసూళ్లతో రీ రిలీజ్‌లలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా బాహుబలి ది ఎపిక్ నిలిచింది.


Click it and Unblock the Notifications











