Baahubali The Epic Box Office: బాహుబలి సరికొత్త చరిత్ర.. ఇండియాలో ఏకైక చిత్రంగా రికార్డు.. ఎన్ని కోట్లంటే?
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.
ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ఒకే భాగం చేసి ది బాహుబలి: ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతూ.. రీ రీలీజ్ సినిమాల్లో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆ రికార్డు వివరాల్లోకి వెళితే..

బాహుబలి చిత్రం ప్రీమియర్ల ద్వారా 5.25 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్ తొలి రోజు 14.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 11 కోట్ల రూపాయలు, మూడో రోజు 9 కోట్ల రూపాయలు, 4వ రోజు 3 కోట్ల రూపాయలు, 5వ రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో హిందీ వెర్షన్ 5.5 కోట్లు, తెలుగు వెర్షన్ 20 కోట్లకుపైగా, కన్నడ వెర్షన్ 4 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, ఇతర బాషల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 11 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ చిత్రాల్లో హిందీ సినిమా సనమ్ తేరీ కసమ్ అత్యధికంగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 38 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. ప్రస్తుతం బాహుబలి ఆ సినిమా కలెక్షన్లను అధిగమించి 50 మేర వసూళ్లను సాధించింది. ఇంకా తుంబడ్ 37.8 కోట్లు, గిల్లీ 32.5 కోట్లు, యే జవానీ హై దివానీ 25 కోట్లు, ఇంటర్‌స్టెల్లర్ 20 కోట్లు, సచిన్ 13 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాల బాక్సాఫీస్ రికార్డులను బాహుబలి తుడిచిపెట్టి సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది.
బాహుబలి ది బిగినింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 650 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా మొత్తం థియేట్రికల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో కలిపి 203 కోట్ల రూపాయల షేర్, 295 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 107 కోట్లు, తమిళనాడులో 127 కోట్లు, కేరళలో 62 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 10 కోట్లు, నార్త్ ఇండియాలో 514 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఇండియాలో 1400 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











