twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ 5 రోజుల కలెక్షన్ వివరాలు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలి 5 రోజుల్లో బాహుబలి అన్ని వెర్షన్స్ కలిపి దాదాపు రూ. 230 కోట్లు(గ్రాస్) వసూలు చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదో కొత్త రికార్డు. బాహుబలి సినిమా ఊహించని విధంగా ఈ రేంజిలో కలెక్షన్లు సాధించడం అందరినీ ఆశ్యర్య పరుస్తోంది.

    నైజాం ఏరియా కలెక్షన్స్
    శుక్ర: 6.22 కోట్లు
    శని: 3.55 కోట్లు
    ఆది: 3.65 కోట్లు
    సోమ: 2.82 కోట్లు
    మంగళ: 2.20 కోట్లు
    తొలి 5 డేస్ కలెక్షన్: 18.44 కోట్లు(షేర్)

    బాలీవుడ్
    శుక్ర: 5.15 కోట్లు
    శని: 7.09 కోట్లు
    ఆది: 10.11 కోట్లు
    సోమ: 6.10 కోట్లు
    మంగళ: 6.15 కోట్లు
    తొలి 5 డేస్ కలెక్షన్: 34.60 కోట్లు(షేర్)

    ఓవర్సీస్
    ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి ఇప్పటికే 4.7 మిలియన్ డాలర్లు(రూ. 29 కోట్లు)వసూలు చేసింది. ఈ వారంతంలోపు రూ. 35 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    తెలుగులో...
    తెలుగులో ‘బాహుబలి' చిత్రం రూ. 100 కోట్ల(గ్రాస్)కు చేరువైంది. మళయాలం, తమిళం, హిందీ, తెలుగు, ఓవర్సీస్ అన్ని వెర్షన్లు కలిపి రూ. 230 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇందులో షేర్(థియేటర్ రెంటు ఖర్చులు పోగా మిగిలేది) ఎంత అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

    స్లైడ్ షోలో బాహుబలి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు...

    జురాసిక్ వరల్డ్

    జురాసిక్ వరల్డ్

    జూరాసిక్ వరల్డ్ సినిమాకు పని చేసిన విఎఫ్ఎక్స్ టీం బాహుబలి సినిమా కోసం పని చేసారు.

    300

    300

    IMDB రేటింగులో బాహుబలి మూవీ... హాలీవుడ్ మూవీ ‘300 యోధులు' కంటే ఎక్కువ రేటింగ్ సొంతం చేసుకుంది.

    100 కోట్లు

    100 కోట్లు

    36 గంటల్లోనే బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

    200 కోట్లు

    200 కోట్లు

    నాలుగు రోజుల్లోనే బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ రూ. 200 కోట్లను అందుకుంది.

    మ్యూజియం

    మ్యూజియం

    సొంతగా మ్యూజిక కలిగి ఉన్న తొలి ఇండియన్ మూవీ ‘బాహుబలి'.

    కిలికి

    కిలికి

    బాహుబలి సినిమా కోసం కిలికి అనే బాషను సృష్టించారు. బాహుబలి సినిమాలో కాలకేయులు మాట్లాడే బాష ఇది.

    ట్రైలర్

    ట్రైలర్

    యూట్యూబులో బాహుబలి ట్రైలర్ 24 గంటల్లో 4.05 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది.

    మ్యారేజ్

    మ్యారేజ్

    బాహుబలి సినిమా కోసం ప్రభాస్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

    వాటర్ ఫాల్స్

    వాటర్ ఫాల్స్

    వాటర్ ఫాల్స్ వద్ద సీన్స్ తీయడానికి రాజమౌళి 109 రోజుల సమయం తీసుకున్నాడు.

    40 గుడ్లు

    40 గుడ్లు

    సినిమా కోసం కండలు పెంచడానికి ప్రభాస్ రోజుకు 40 గుడ్లు తిన్నాడు.

    బాడీబిల్డింగ్

    బాడీబిల్డింగ్

    ప్రభాస్, రానా బాడీ బిల్డింగ్ చేయడానికి రూ. 1.5 కోట్లు పెట్టి జిమ్ సామాగ్రి కొన్నారు.

    45 ఫీట్ల సెట్

    45 ఫీట్ల సెట్

    సాధారణంగా ఇండియన్ సినిమాల్లో 24 ఫీట్ల ఎత్తు ఉండే సెట్లు వేస్తారు.కానీ బాహుబలి సినిమా కోసం 45 ఫీట్ల ఎత్తు ఉండే సెట్లు వేసారు.

    ప్రీ ప్రొడక్షన్

    ప్రీ ప్రొడక్షన్

    బాహుబలి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు ఒక సంవత్సరం పాటు సాగింది.

    26 స్టూడియోలు

    26 స్టూడియోలు


    బాహుబలి సినిమా కోసం 26 విఎఫ్ఎక్స్ స్టూడియోలు, 600 మంది గ్రాఫిక్ ఆర్టిస్టులు పని చేసారు.

    ప్రభాస్ -రానా

    ప్రభాస్ -రానా

    ప్రభాస్, రానా ఈ సినిమాకు తగిన విధంగా బాడీ పెంచడానికి ప్రత్యేకమైన డైట్ తీసుకున్నారు.

    100 కేజీలు

    100 కేజీలు

    ప్రభాస్, రానా సినిమా కోసం 100 కేజీలకు పైగా బరువు పెరిగారు.

    పీటర్ హెయిన్స్

    పీటర్ హెయిన్స్

    బాహుబలి సినిమాకు పీటర్ హెయిన్స్ స్టంట్స్ కంపోజ్ చేసాడు.

    బిబిసి

    బిబిసి

    బాహుబలిపై బిబిసిలో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది.

    వివిధ భాషలు

    వివిధ భాషలు

    బాహుబలి అత్యధిక బాషల్లో విడుదలైన ఇండియన్ సినిమా.

    250 కోట్లు

    250 కోట్లు

    బాహుబలి రెండు పార్టులు కలిపి రూ. 250 కోట్ల బడ్జెట్.

    4500 విఎఫ్ఎక్స్ షాట్లు

    4500 విఎఫ్ఎక్స్ షాట్లు

    బాహుబలి సినిమాలో దాదాపు 4500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి.

    English summary
    Baahubali has been making Box Office records ever since the release of the movie. The movie opened with the highest first day collections at the Indian Box Office and has been breaking records since.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X