twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనాలో బాహుబలి2 కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే రికార్డు బ్రేక్

    By Rajababu
    |

    దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి2 చిత్రం చైనా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. తొలిరోజే రికార్డులను బాహుబలి2 తిరగరాసింది. ఇక ఈ చిత్రం మరోసారి రికార్డుల పరంపరను కొనసాగించనున్నది. బాహుబలి1 సాధించిన మొత్తం కలెక్షన్లను బాహుబలి2 ఒక్కరోజే సాధించడం ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేస్తున్నది.

    Recommended Video

    Bahubali Had Huge Collections in china To

    తొలిరోజే రికార్డు కలెక్షన్లు

    బాహుబలి మరోసారి బాక్సాఫీస్‌పై రికార్డుల పంజా విసిరిందని ట్రేడ్ అనలిస్టు రమేష్‌బాలా ట్వీట్ చేశారు. బాహుబలి2 చిత్రం మొదటిరోజే చైనాలో 2.85 మిలియన్ డాల్లర్లు అంటే రూ.19 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం చైనాలో 7 వేల థియేటర్ల విడుదలైంది. ఆమీర్‌ఖాన్ దంగల్ రిలీజైన స్క్రీన్లకంటే ఇవి ఎక్కువ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    బాహుబలి1కి పేలవమైన కలెక్షన్లు

    బాహుబలి1కి పేలవమైన కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించిన బాహుబలి1 చైనాలో సత్తా చాటలేకపోయింది. భారీ కలెక్షన్లను సాధించడంలో బాహుబలి1 వెనుకపడింది. కేవలం రూ.8 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి2 రిలీజ్‌పై అనేక భయాందోళనలు అలుముకొన్నాయి. చైనాలో ఈ చిత్ర రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది.

    చైనాలో దంగల్ కలెక్షన్లు

    చైనాలో దంగల్ కలెక్షన్లు

    బాహుబలి1 తర్వాత విడుదలైన అమీర్ ఖాన్ దంగల్ చైనా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. కేవలం చైనాలోనే రూ.1200 కోట్ల కలెక్షన్లను సాధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా దంగల్ 2 వేల కోట్లు వసూలు చేసినట్టు ఓ రికార్డు నమోదైంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా ఘనతను సాధించింది.

    చైనాలో దుమ్మురేపిన ఐదు సినిమాలు

    చైనాలో ఇప్పటి వరకు ఐదు భారతీయ సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్లను వసూలు చేశాయి. వాటిలో సీక్రెట్ సూపర్‌స్టార్ 6.74 మిలియన్ డాలర్లు, హిందీ మీడియం 3.39 డాలర్లు, బాహుబలి2 2.85 మిలియన్ డాలర్లు, దంగల్ 2.49 మిలియన్ డాలర్లు, భజరంగీ భాయ్‌జాన్ 2.20 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.

     ఆల్ టైమ్ రికార్డు దిశగా బాహుబలి2

    ఆల్ టైమ్ రికార్డు దిశగా బాహుబలి2

    బాహుబలి2 విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే దంగల్ సాధించిన రికార్డును ఈ చిత్రం తుడిచిపెట్టే అవకాశం ఉంది. మరో రెండు మూడు రోజుల్లో భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా బాహుబలి2 ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ ఛాన్స్ లేకపోలేదు.

    English summary
    Baahubali 2 is back at breaking record once again. The second part of SS Rajamouli’s war epic released in the Chinese market on May 4 and has already earned more than what the first part did in its entire run in the country. Movie trade expert Ramesh Bala tweeted on Friday, “#Baahubali2 has crossed the lifetime biz of #Baahubali ($1.18 Million) in #China.” According to Bollywood Life, the movie released in 7000 screens, more than Aamir Khan’s Dangal. It has already earned USD 1.2 million by the evening shows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X