బాహుబలి2కు ధీటుగా సాహో.. బాక్సాఫీస్‌పై దాడికి ప్రభాస్.. ఫస్ట్‌ డే వసూళ్లేంతంటే!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 30న రిలీజ్‌కు సిద్ధమైంది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్స్‌కు మంచి డిమాండ్ ఉండటంతో ఈ సినిమా వసూళ్లపై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా అంచనాలు వేస్తున్నారు. సాహో తొలి రోజు కలెక్షన్లు ఉండే అవకాశం ఉందంటూ విశ్లేషణ చేస్తున్నారు. కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో బాహుబలి2

సినీ ఇండస్ట్రీలో బాహుబలి2

తెలగు సినిమా ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు (షేర్) సాధించిన చిత్రంగా బాహుబలి2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి2 123 కోట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, బాహుబలి రూ.46 కోట్లతో రెండో స్థానంలో ఉంది. పవన్ కల్యాణ్ నటించిన అజాతవాసి రూ.39.30 కోట్లతో మూడో స్థానంలో ఉంది. అలాగే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత రూ.37.20 కోట్లతో నాలుగు స్థానంలో, ఖైదీ నంబర్ 150 రూ.35.22 కోట్లతో ఐదో స్థానంలో ఉంది.

టాప్ టెన్‌లో అత్యధిక వసూళ్లతో

టాప్ టెన్‌లో అత్యధిక వసూళ్లతో

ఇక టాప్ 10 చిత్రాలను పరిగణనలోకి తీసుకొంటే.. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో భరత్ అనే నేను (35.20 కోట్లు), మహర్షి రూ.32.2 కోట్లు, వినయ విధేయ రామ రూ.31.31 కోట్లు, రంగస్థలం రూ.30.02 కోట్లు, జనతా గ్యారేజ్ రూ.28.70 ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో నిలిచాయి.

సాహో రేంజ్ ఎంత అంటే

సాహో రేంజ్ ఎంత అంటే

ఇప్పుడు భారీ రేంజ్‌లో దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో భారీ స్కీన్లలో సాహో రిలీజ్ సిద్ధమవుతున్నది. అయితే ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు బాహుబలి2కు ధీటుగా ఉంటాయా? అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అయితే బాహుబలి2 దాటకపోయినా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

సాహో తొలిరోజు అంచనా

సాహో తొలిరోజు అంచనా

సాహో చిత్రాన్ని హిందీలో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొంటే సుమారు రూ.25 కోట్ల వరకు తొలిరోజు బాలీవుడ్‌లో వసూళ్లు సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే వసూళ్లను బట్టి సినిమా రేంజ్ డిసైడ్ అవుతుందనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X