Baby 18 days Collections కొనసాగుతున్న బేబీ కలెక్షన్ల హవా.. 19వ రోజు వసూళ్లు ఎంతంటే?

యువ హీరో, హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సాయిరాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 19వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బేబీ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా మూడో వారంలో కూడా భారీ వసూళ్లను బాక్సాఫీస్ వద్ద కురిపిస్తున్నది. 18వ రోజు ఈ చిత్రం 80 లక్షల రూపాయలను రాబట్టింది. ఓవర్సీస్‌లో 50 లక్షల వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి

Baby movie 18 days collections worldwide: Anand Deverakonda movie Strong at box office

గత 19 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 16 కోట్లు, సీడెడ్ 5.5 కోట్లు, గుంటూరు జిల్లాలో 1.95 కోట్లు, కృష్ణా జిల్లాలో 2 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.2 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.6 కోట్లు, ఉత్దరాంధ్ర ప్రాంతంలో 6 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. గత 19 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల మేర షేర్ కలెక్షన్లను సాధించింది.

గత 19 రోజుల్లో తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో గత 19 రోజుల్లో 4.7 కోట్ల కలెక్షన్లు, తమిళనాడులో 90 కోట్ల కలెక్షన్లు, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షల కలెక్షన్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది.

Baby movie 18 days collections worldwide: Anand Deverakonda movie Strong at box office

బేబీ మూవీ 19 రోజుల ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షలతో కలిపి ఇండియా వైడ్‌గా 68 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 5.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 73 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

బేబీ మూవీ బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ మోస్తారుగా నమోదు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఈ చిత్రం రికార్డు స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా 100 కోట్ల మైలురాయిని చేరుతుందా? లేదా వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X