Baby 2 Days Collections: 2వ రోజూ మాస్ కుమ్ముడు.. ఏకంగా అన్ని కోట్లతో రచ్చ.. అక్కడ టార్గెట్ ఫినీష్

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన చిత్రాల్లో 'బేబి' ఒకటి. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతోన్న ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా నేటి యువత ప్రేమ విషయంలో చేస్తున్న తప్పులను ఎత్తి చూపే అంశాలతో తెరకెక్కింది. ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకుని గత శుక్రవారమే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు తగ్గట్లుగానే దీనికి భారీ స్పందన లభిస్తోంది. దీంతో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. మరి 'బేబి' మూవీ రెండు రోజుల రిపోర్టును మీరే చూడండి మరి!

త్రికోణ ప్రేమతో వచ్చిన 'బేబి': ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'బేబి'. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ జూలై 14వ తేదీన గ్రాండ్‌గా విడుదలైంది.

 Baby 2 Days Collections:

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ అయింది.

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 2.98 కోట్లు షేర్, రూ. 5.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 Baby 2 Days Collections:

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 2 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 70 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 90 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 32 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. రూ. 5.58 కోట్లు షేర్, రూ. 9.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 5.58 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 26 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.04 కోట్లు షేర్‌, రూ. 13.30 కోట్లు గ్రాస్ రాబట్టింది.

 Baby 2 Days Collections:

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 7.04 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 96 లక్షలు రాబడితే ఆనంద్ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఒక్క రోజులో ఎన్నో రికార్డులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబి' మూవీకి రెండు రోజుల్లోనే ఊహించని విధంగా వసూళ్లు వచ్చాయి. దీంతో టార్గెట్‌కు చాలా చేరువగా వచ్చేసింది. మరోవైపు ఈ సినిమా నైజాంలో రెండు రోజుల్లోనే రూ. 2.55 కోట్లు షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. అలా ఓవర్సీస్‌లో 200K డాలర్ల మార్కును కూడా దాటేసి రికార్డులు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X