Baby 3 Days Collections: బేబి మాస్ బ్యాటింగ్.. అన్ని కోట్ల టార్గెట్ ఔట్.. 3 రోజుల్లోనే కోట్ల లాభాలు

'బేబి.. బేబి.. బేబి' ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తున్న సినిమా ఇది. ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటి జనరేషన్‌ ప్రేమ ఎలా ఉందో చెప్పే కాన్సెప్టుతో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా గత శుక్రవారమే ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. దీనికి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో మూడో రోజే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫినీష్ చేసి క్లీన్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీరే చూడండి!

ఎమోషనల్ కంటెంట్‌తో 'బేబి':ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలను చేసిన సినిమానే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.

Baby Movie 3 Days Worldwide Official Collections

బేబి మూవీ బిజినెస్ వివరాలివే:ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

Baby Movie

3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజూ రికార్డు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి.. రూ. 3.77 కోట్లు షేర్, రూ. 6.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Baby Movie

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది: 3 రోజుల్లో 'బేబి' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 60 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో కలిపి.. రూ. 9.35 కోట్లు షేర్, రూ. 16.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?: ఆంధ్రా, తెలంగాణలో మూడు రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 9.35 కోట్లు షేర్‌ను రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 43 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.55 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.33 కోట్లు షేర్‌, రూ. 23.52 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: ఫెయిల్యూర్ లవ్ కాన్సెప్టుతో వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 11.33 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.33 కోట్లు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.

Baby Movie

15వ మూవీ.. సంచలనంగా: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబి' మూవీకి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. తద్వారా ఈ ఏడాది హిట్టైన 15వ తెలుగు సినిమాగా నిలిచింది. ఇక, ఓవర్సీస్‌లో 350K డాలర్ల మార్కును కూడా దాటేసి రికార్డులు సాధించింది. అంతేకాదు, మూడు రోజుల్లోనే 3 కోట్లకు పైగా లాభాలను అందుకుని చరిత్రను సృష్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X