Baby Day 1 Collections: బేబి పెను సంచలనం.. తొలి రోజే అన్ని కోట్లతో ఊచకోత.. ఆనంద్ దేవరకొండ రికార్డు

స్టార్ల ఫ్యామిలీల నుంచి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే సక్సెస్ అవగా.. మరికొందరు హిట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటి వారిలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఒకడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న అతడు.. తాజాగా 'బేబి' అనే సినిమాతో వచ్చాడు. దీనికి మాత్రం మొదటి రోజు మంచి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ మొదటి రోజు రిపోర్టును చూద్దాం పదండి!

Baby Movie Day 1 Worldwide Official Collections

సందేశాత్మక కథతో వచ్చిన బేబి: ఆనంద్ దేవరకొండ హీరోగా.. సాయి రాజేష్ తెరకెక్కించిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, సీత కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ జూలై 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Baby Movie Day 1 Worldwide Official Collections

బేబి మూవీ బిజినెస్ వివరాలివే: ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

Baby Movie Day 1 Worldwide Official Collections

అలాంటి టాక్.. కలెక్షన్లు ఫుల్‌గా: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆనంద్ 'బేబి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ఆశించిన రీతిలో రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన ఎక్కువ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకారమే మొదటి రోజు భారీ వసూళ్లు దక్కాయి.

Baby Movie Day 1 Worldwide Official Collections

తొలి రోజు తెలుగు వసూళ్లు ఇలా: 'బేబి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 2.60 కోట్లు షేర్, రూ. 4.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Baby Movie Day 1 Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజే భారీ స్థాయిలో రూ. 2.60 కోట్లు షేర్ మాత్రమే రాబట్టిన ఆనంద్ 'బేబి' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించిందని చెప్పొచ్చు. దీంతో కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 16 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 72 లక్షలు రాబట్టింది. ఇలా ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.48 కోట్లు షేర్‌, రూ. 7.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'బేబి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 3.48 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.52 కోట్లు రాబడితేనే ఆనంద్ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఆనంద్ కెరీర్‌లోనే టాప్ మూవీ: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబి' మూవీకి మొదటి రోజు ఊహించని స్పందన లభించింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా 'బేబి' రికార్డు సాధించింది. ఇదే ఊపు కొనసాగితే వీకెండ్‌లోనే ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X