Baby Business: బేబి మూవీకి రికార్డు బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే హిట్.. థియేటర్ల లెక్క చూశారంటే!
విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చి.. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ. 'దొరసాని' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన అతడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించాడు. కానీ, ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్ కొట్టాలన్న లక్ష్యంతో 'బేబి' అనే ప్రేమకథా చిత్రంతో రాబోతున్నాడు. శుక్రవారమే విడుదల కాబోతున్న ఈ సినిమా ఎంత బిజినెస్ చేసుకుంది? ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతుంది? అనేవి చూద్దాం పదండి!
బేబి అంటూ వస్తున్నాడు:ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ తెరకెక్కించిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ మూవీ జూలై 14వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

అలాంటి కథ.. యూత్‌కు:బస్తీకి చెందిన ఓ అమ్మాయి పెద్ద కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అప్పటి వరకూ ఆమెను ప్రేమించిన హీరోతో విభేదాలు ఎందుకు వచ్చాయి? వీళ్లిద్దరి మధ్యలోకి వచ్చిన కుర్రాడు ఏమయ్యాడు? అనే అంశాలతో 'బేబి' మూవీ తెరకెక్కింది. ముఖ్యంగా ఇందులో యూత్‌కు కనెక్ట్ అయ్యే చాలా అంశాలను జోడించి రూపొందించారు.
ప్రమోషన్స్‌తో సందడిగా:పూర్తి స్థాయి ఎమోషనల్ లవ్ స్టోరీతో రూపొందిన 'బేబి' సినిమాను జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లు, ఇంటర్వ్యూలు కూడా జరిగాయి. వీటన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

బేబికి షాకింగ్‌గా బిజినెస్:ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

అన్ని కోట్లు వస్తేనే హిట్:ఆనంద్ దేవరకొండకు ఒక్క హిట్ కూడా లేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 'బేబి' మూవీకి బిజినెస్ రికార్డు స్థాయిలోనే జరిగింది. ఇక, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 7.40 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00కోట్లుగా నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అన్ని థియేటర్లలో రిలీజ్:'బేబి' మూవీకి ఓవరాల్‌గా థియేటర్లు మంచిగానే లభించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 120, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 220 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 340 థియేటర్లలో వస్తున్న ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఏరియాలను కలిపి ప్రపంచ వ్యాప్తంగా 500 వరకూ థియేటర్లలో వస్తుంది.


Click it and Unblock the Notifications











