Baby Closing Collections బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన బేబీ.. 10 కోట్లు పెడితే.. ఎన్ని కోట్ల లాభమంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కలర్ ఫోటో ఫేమ్ సాయి రాజేశ్ దర్శకత్వంలో యువ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ చిత్రం అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకొన్నది. టాలీవుడ్‌లో చిన్న చిత్రాల్లో అతిపెద్ద విజయం చేజిక్కించుకొన్న సినిమా బేబీ రికార్డు క్రియేట్ చేసింది. జూలై 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందనే వివరాల్లోకి వెళితే..
బేబీ బడ్జెట్ ఎంతంటే?: బేబీ చిత్రం బడ్జెట్, స్క్రీన్ కౌంట్ వివరాల్లోకి వెళితే.. ట్రయాంగిల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాను సుమారు 7 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమా సుమారుగా 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ఈ సినిమాను నైజాంలో 120 స్క్రీన్లు, సీడెడ్‌లో 40 స్క్రీన్లు, ఆంధ్రాలో 180 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 510 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత పాజిివ్ టాక్ రావడంతో స్క్రీన్ల సంఖ్య భారీగా పెంచారు.

బేబీ ప్రీ రిలీజ్ బిజినెస్: ఇక బేబీ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పాటలకు భారీగా రెస్సాన్స్, యూత్ నుంచి ఆదరణ పొందడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా హక్కులు వ్యవహారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. నైజాం హక్కులను 2.5 కోట్లకు, ఆంధ్రా హక్కులు 3 కోట్లకు, సీడెడ్ హక్కులు 1 కోటి రూపాయలకు, మిగితా రాష్ట్రాల్లో హక్కులు 1.5 కోట్లకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ 8 కోట్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

బేబీ నాలుగు వారాల కలెక్షన్లు: బేబీ మూవీ తొలి ఆట నుంచే హిట్ టాక్ అందుకొన్నది. దాంతో ఈ సినిమా తొలి వారంలో తెలుగు 34 కోట్లు, రెండో వారం 20 కోట్లు, మూడో వారం 6 కోట్ల రూపాయలు, నాలుగో వారం 3.5 కోట్ల షేర్ రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 73.5 కోట్లు రాబట్టింది.

బేబీ 30 రోజుల్లో ఏపీ, నైజాంలో: బేబీ సినిమా అన్ని వర్గాల ఆదరణకు గురి కావడంతో విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల వరద పారింది. నైజాంలో 5.8 కోట్లు, సీడెడ్‌లో 2 కోట్ల రూపాయలు, గుంటూరు 2 కోట్ల రూపాయలకుపైగా, కృష్ణా జిల్లాలో 1.2 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.55 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.6 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో 37 కోట్ల షేర్ వసూలు చేసింది.

బేబీ రాష్ట్రాల వారీగా వసూళ్లు: బేబీ చిత్రానికి సంబంధించి.. వివిధ రాష్ట్రాల్లో వసూళ్ల వివరాల్లోకి వెళితే.. విడులైన ప్రతీ చోట ఊహించని కలెక్షన్లు సాధించింది. కర్ణాటకలో 5.5 కోట్ల, ఏపీ, నైజాంలో 37 కోట్ల గ్రాస్, తమిళనాడులో 1 కోటి గ్రాస్, కేరళ, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 73.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం సుమారు 6.5 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

బేబీ మూవీకి ఎంత లాభమంటే?: బేబీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండియాలో ఏ సినిమా సాధించిన కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా 10 కోట్ల బిజినెస్ చేస్తే.. ఏకంగా 80 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు భారీ లాభాలను పంచిపెట్టింది.


Click it and Unblock the Notifications











