Baby Collections వైష్ణవి, ఆనంద్, విరాజ్ మ్యాజిక్.. బేబీకి భారీ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ హీరో, హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. హృదయ కాలేయం, కలర్ ఫోటో సినిమాలను అందించిన సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యువ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. జూలై 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు ఎలా ఉంది? స్క్రీన్ కౌంట్ ఎంత? బడ్జెట్ ఏం రేంజ్? కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
లవ్, బ్రేకప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలిమెంట్స్‌తో బేబీ చిత్రాన్ని యువ టీమ్‌తో రూపొందించారు. ఈ సినిమాను సుమారు 8 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాను భారీ లెవల్‌లో ప్రమోట్ చేయడంలో సఫలమయ్యారు. దాంతో ఈ సినిమా మొత్తంగా 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రిలీజ్ చేశారనే విషయనాన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

బేబీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారంలోకి వెళితే.. నైజాం హక్కులను 2.5 కోట్లు, ఆంధ్రాల హక్కులు 3 కోట్లు, సీడెడ్ హక్కులు 1 కోటి రూపాయలకు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు 6.5 కోట్ల మేర అమ్ముడుపోయాయని తెలిసింది. ఇక ఓవర్సీస్ హక్కులు 1.45 కోట్లుతో మొత్తంగా ఈ సినిమా హక్కులు 8 కోట్ల మేర నమోదు అయ్యాయి.

బేబీ మూవీకి రిలీజ్‌కు ముందు భారీ క్రేజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. నైజాంలో 120 స్క్రీన్లు, సీడెడ్‌లో 50 స్క్రీన్లు, ఆంధ్రాలో 180 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 350 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి 150 స్క్రీన్ల వరకు రిలీజ్ చేశారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక బేబీ మూవీ పెయిడ్ ప్రీమియర్లు, అమెరికాలో ప్రీమియర్లు గురువారం జూలై 13వ తేదీన మొదలయ్యాయి. అమెరికాలో ప్రీమియర్లు, డే 1 అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమా 100K డాలర్లు వసూలు చేసింది. తొలి రోజు మరో 100K రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఓవర్సీస్‌లో తొలి రోజు 200K డాలర్లు అంటే.. 1.65 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు విషయానికి వస్తే.. తొలి రోజు సుమారు 3 నుంచి 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4 నుంచి 5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











