Baby day 2 Collections బేబీ కలెక్షన్ల దుమారం.. రెండో రోజే భారీ లాభాల్లోకి.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ నిర్మాత ఎస్‌కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందిన బేబీ మూవీ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. యువ హీరో, హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతున్నది. తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండు రోజు అంతకు మించి కలెక్షన్లను సాధించింది. బేబీ మూవీ రెండో రోజు కలెక్షన్ల అంచనా ఏ రేంజ్‌లో ఉందంటే?
బేబీ చిత్రం రిలీజ్‌కు ముందే మ్యూజిక్ హిట్‌గా నిలిచింది. ఓ రెండు ప్రేమ మేఘాలు పాట మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించింది. ఇక మ్యూజిక్ పెంచిన క్రేజ్ తర్వాత ట్రైలర్ మరింత అంచనాలు పెంచింది. రిలీజ్‌కు ముందు ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్లకు భారీ స్పందన రావడంతో సినిమాకు పాజిటివ్‌గా మారింది.

బేబీ మూవీ పెయిడ్ ప్రీమియర్ల గురించి దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత SKN మాట్లాడుతూ.. రిలీజ్‌కు ముందు రోజు వరకు మాకు ఓ రకమైన ఫీల్ ఉండేది. పెయిడ్ ప్రీమియర్లను హైదరాబాద్‌లో నాలుగు, వైజాగ్, విజయవాడలో ఒక్కొక్కటి వేయాలని అనుకొన్నాం. కానీ డిమాండ్ విపరీతంగా ఉండటంతో 100 పెయిడ్ ప్రీమియర్లు వేశాం అని చెప్పారు.
పెయిడ్ ప్రీమియర్లకు భారీగా పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం బేబీ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లు నమోదయ్యాయి. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 4.5 కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఇక శనివారం బేబీ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. రెండో రోజు కూడా భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. మార్నింగ్ షోకు 50 శాతం, మ్యాట్నీకి 65 శాతం, ఫస్ట్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోకు 80 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో రెండో రోజు కూడా భారీ కలెక్షన్ల దిశగా బేబీ పరుగు పెట్టింది.

బేబీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. అమెరికాలో ఈ సినిమాను 115 లోకేషన్లలో 230కిపైగా కలెక్షన్లను ప్రదర్శిస్తున్నారు. రెండో రోజు ఈ చిత్రం 24K వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు 8 నుంచి 8.5 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
బేబీ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు 8 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 16 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా రెండో రోజు లాభాల్లోకి ప్రవేశించే అవకాశాలు స్ఫష్టమయ్యాయి.


Click it and Unblock the Notifications











