Bachchhan Paandey day 1 collections.. తొలి రోజు దుమ్ము రేపిన అక్షయ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ కృతి సనన్ జంటగా నటించిన బచ్చన్ పాండే చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను నమోదు చేసింది. తమిళంలో విజయవంతమైన జిగర్తాండ, తెలుగులో రీమేక్ చిత్రం గద్దలకొండ గణేష్ సినిమా ఆధారంగా రూపొందిన బచ్చన్ పాండే చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని ఘనంగా ప్రారంభించింది.
ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం రూపొందింది. హోలీ పండుగ సందర్బాన్ని పురస్కరించుకొని మార్చి 18న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే బెస్ట్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అయితే దేశవ్యాప్తంగా భారీ టాక్‌తో దూసుకెళ్తున్న ది కశ్మీరి ఫైల్స్ సినిమా కారణంగా అక్షయ్ కుమార్ సినిమాపై దెబ్బ పడింది. అంతేకాకుండా హోలీ పండుగ కావడంతో యూత్ అందరూ రోడ్లపైన, ఫ్యామిలీతో కలిసి రంగుల పండుగ జరుపుకోవడంతో మార్నింగ్, మ్యాట్నీ షోలకు పెద్దగా కలెక్షన్ల నమోదు కాలేదు. దాంతో ఈ సినిమా తొలి రోజున 13.25 కోట్ల వసూళ్లనునమోదు చేసింది.

తొలి రోజు కలెక్షన్ల గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ మాట్లాడుతూ.. ది కశ్మీరి ఫైల్స్ సినిమా వేవ్‌ను ఎదురించి మంచి వసూళ్లను బచ్చన్ పాండే రాబట్టడం ఆశ్చర్యాన్ని కలిగింది. రెండు అంకెల వసూళ్లను నమోదుచేసింది. హోలీ కారణంగా గుజరాత్, ముంబైలో వసూళ్లు భారీగా తగ్గాయి. రెండో, మూడో రోజున ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది అని చెప్పారు.
కరోనావైరస్ తర్వాత విడుదలైన సినిమాల్లో బచ్చన్ పాండే ఘనమైన కలెక్షన్లను రాబట్టింది. దీపావళీ పండుగ నేపథ్యంలో రిలీజైన సూర్య వంశీ చిత్రం తొలి రోజున 26.29 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బచ్చన్ పాండే 13.25 కోట్లు, 83 మూవీ 12.64 కోట్లు, గంగూభాయ్ కతియావాడి 10 కోట్లు వసూలు చేసింది అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











