Bachchhan Paandey day 2 collections: కలెక్షన్లు నిలబెట్టుకున్న అక్షయ్.. కానీ భారీ దెబ్బేసిన కాశ్మీర్ ఫైల్స్?

అక్షయ్ కుమార్ , కృతి సనన్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన బచ్చన్ పాండే చిత్రం శుక్రవారం అంటే హోలీ సందర్భంగా విడుదలైంది . ఇందులో అక్షయ్ విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం వల్ల ఈ సినిమా మీద అందరిలోనూ చాలా ఆసక్తి రేపింది. ఇక ఈ సినిమా తొలి రోజు 13.25 కోట్లు రాబట్టింది. అదే సమయంలో, ఈ చిత్రం రెండో రోజు కూడా మంచి వసూళ్లను కొనసాగిస్తుంది. ఈ సినిమా రెండో రోజు 11 కోట్లు రాబట్టింది. దీని ప్రకారం ఈ సినిమా 2 రోజుల్లో 23 కోట్లు రాబట్టింది. ఆదివారం సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లు రాబట్టవచ్చు. ఇక రెండో రోజు కలెక్షన్స్ కు సంబంధించిన వివరాలలోకి వెళితే

మార్చి 18న

మార్చి 18న

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ కృతి సనన్ జంటగా నటించిన బచ్చన్ పాండే. తమిళంలో విజయవంతమైన జిగర్తాండ, తెలుగులో రీమేక్ చిత్రం గద్దలకొండ గణేష్ సినిమా ఆధారంగా రూపొందిన బచ్చన్ పాండే చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదటి రోజే ఘనంగా ప్రారంభించింది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా హోలీ పండుగ పురస్కరించుకొని మార్చి 18న రిలీజయింది.

అతి కష్టం మీద

అతి కష్టం మీద

అక్షయ్ కుమార్ యాక్షన్ కామెడీ చిత్రం 'బచ్చన్ పాండే' శుక్రవారం బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ సాధించింది. బచ్చన్ పాండే తొలిరోజు 13.25 కోట్లు వసూలు చేసింది. హోలీ రోజున ఈ సినిమా రూ.15 కోట్లు వసూలు చేస్తుందని మేకర్స్ అంచనా వేసినప్పటికీ. కానీ ఇది జరిగలేదు. ఇప్పుడు అందరి చూపు వారాంతం పైనే పడింది. అయితే వీకెండ్ అంటే శనివారం ఓపెనింగ్స్‌లో సినిమా సందడి చేయలేకపోయింది. ఓవరాల్ గా ఈ సినిమా రెండు రోజుల్లో అతి కష్టం మీద 26 కోట్లు వసూలు చేసింది.

రెండో సినిమా

రెండో సినిమా

అయితే కోవిడ్ సమయంలో అక్షయ్‌కి ఇది రెండో సినిమా. గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదలైన సూర్యవంశీ ఈ జాబితాలో అక్షయ్ నటించిన మొదటి చిత్రం. ఈ సినిమా రెండో రోజు 26 కోట్ల 29 లక్షలు రాబట్టింది. ఇక బచ్చన్ పాండే రెండు రోజుల్లో టోటల్ గా రూ.25.25 కోట్లు వసూలు చేసింది.

 బిజినెస్ తగ్గుముఖం

బిజినెస్ తగ్గుముఖం

అయితే మరోవైపు వివేక్ అగ్నిహోత్రి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్' తొమ్మిదో రోజు రూ.26.5 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ముంబై మరియు గుజరాత్‌లలో బచ్చన్ పాండే చిత్రం శుక్రవారం అత్యధిక వసూళ్లను సాధించింది. శనివారం యూపీ, బీహార్, ఢిల్లీ వంటి కొన్ని సెంటర్లలో శుక్రవారం కంటే ఈ చిత్రం మెరుగ్గా వసూళ్లు రాబట్టగా ముంబైలో మాత్రం కాస్త బిజినెస్ తగ్గుముఖం పట్టింది.

మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా

మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా

ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం. అయితే 'ది కాశ్మీర్ ఫైల్స్' సక్సెస్ ఫుల్ రన్ ఈ సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో SS రాజమౌళి 'RRR' విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో 'బచ్చన్ పాండే' బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం కోసం అక్షయ్ కుమార్ తన ప్రస్తుత పారితోషికంపై 20 కోట్లు తగ్గించాడని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X