Bad Boys 4 Collections: 8355 కోట్ల బడ్జెట్.. డిజాస్టర్ దిశగా బాడ్ బాయ్స్ 4.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
హాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కొలంబియా పిక్చర్స్ బ్యానర్‌పై జెర్రీ బ్రక్‌హైమర్, హీరో విల్ స్మిత్, డౌగ్ బెల్‌గ్రాడ్ రూపొందించిన చిత్రం బ్యాడ్ బాయ్స్ 4 (Bad Boys Ride or Die). ఆదిల్ అండ్ బిలాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్, వెనెస్పా హడ్‌జెన్స్, అలెగ్జాండర్ లడ్‌విగ్ నటించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన బ్యాడ్ బాయ్స్ 4 (Bad Boys 4) చిత్రాన్ని భారీగా ఖర్చు పెట్టి తీశారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ సినిమాను తెరపైన రిచ్‌గా చూపించేందుకు నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాపై అత్యంత నమ్మకంతో స్వయంగా హీరో విల్ స్మిత్ నిర్మాతగా మారారు. యాక్టర్ల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 8355 కోట్ల రూపాయలతో రూపొందించారు.

బ్యాడ్ బాయ్స్ లైఫ్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన బ్యాడ్ బాయ్స్ 4 చిత్రం ఘనంగా ఓపెనింగ్ కలెక్షన్లను సాధించింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 60 మిలియన్లు అంటే సుమారుగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గతంలో బ్యాడ్ బాయ్స్ లైఫ్ చిత్రం తొలి వారాంతం 63 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సిరీస్‌లో అత్యధికంగా కలెక్షన్లు వసూలు చేసిన రెండో చిత్రంగా ఈ చిత్రం ఘనతను సాధించింది.
ఇక ఓవర్సీస్‌లో అంటే.. అమెరికా కాకుండా ఇతర దేశాల్లో ఘనంగా కలెక్షన్లను వసూలు చేస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే సుమారుగా 104 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 200 మిలియన్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. అయితే భారత్ కాకుండా ఇతర దేశాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది.
అయితే ఇండియాలో మాత్రం ఈ చిత్రం అత్యంత పేలవంగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోవడంతో దారుణంగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. తొలి రోజు ఇండియాలో 35 లక్షలు, రెండో రోజు 45 కోట్లు, మూడో రోజు 90 లక్షలు, నాలుగో రోజు 65 లక్షలు, 5వ రోజు 20 లక్షలు, 6వ రోజు 35 లక్షలు వసూలు చేసింది. దాంతో గత 6 రోజుల్లో ఈ చిత్రం 2.73 కోట్ల నికరంగా, 6 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఏడో రోజు 30 నుంచి 40 లక్షలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
బాడ్ బాయ్స్ ఫ్రాంచైజీలకు ఇండియాలో మంచి ఆదరణ ఉంటుంది. ఈ సినిమాకు ఇండియాలో ప్రేక్షకులు ముఖం చాటేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఎంతో క్రేజ్ ఉన్న ఈ సినిమా ఓ చిన్న మూవీ సాధించిన కలెక్షన్లను కూడా సాధించలేకపోవడం డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లను ఆందోళనకు గురి చేస్తున్నది.


Click it and Unblock the Notifications











