Bad Newz: బ్యాడ్ న్యూస్ మూవీకి రికార్డు ఒపెనింగ్స్..త్రిప్తి డిమ్రి సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్ తెరపైకి ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల తార త్రిప్తి డిమ్రీ, వికీ కౌశల్ నటించిన చిత్రం బ్యాడ్ న్యూస్. హిందీ సినీ పరిశ్రమలో అగ్ర సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రం జూలై 19వ తేదీన రిలీజ్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా, అమెజాన్ ప్రైమ్ వీడియో సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రాబట్టిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

బ్యాడ్ న్యూస్ సినిమా కథ విషయానికి వస్తే.. ఒకే రాత్రి ఓ అమ్మాయి ఇద్దరు వ్యక్తులతో శృంగారం చేస్తుంది. ఆ తర్వాత ఆమె గర్బవతి కావడంతో పరీక్షలు చేసిన వైద్యులు చరిత్రలో ఓ అరుదైన సంఘటనను గృహిస్తారు. ఇద్దరు పురుషుల అండాలతో కవల పిల్లలు పుడుతున్నారనే విషయాన్ని తేల్చుతారు. ఆ ఇద్దరు పిల్లల జననం తర్వాత వారి తండ్రులు, తల్లి మధ్య జరిగిన మానసిక సంఘర్షణ ఏంటనేది సినిమా కథ.

Bad Newz Day 1 Box Office Collections Worldwide Tripti Dimri movie Start decent at GBOC

బాలీవుడ్ పాపులర్ నిర్మాతలు కరణ్ జోహర్, హిరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, ఆనంద్ తివారీ, అమ్రిత్ పాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్.. టీజర్లు, ట్రైలర్స్, లిరికల్ వీడియోస్‌కు ఊహించిన క్రేజ్ రావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

బ్యాడ్ న్యూస్ సినిమా బిజినెస్‌ను థియేట్రికల్‌గా 100 కోట్ల రూపాయలను వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల సాధిస్తే హిట్‌గా పరిగణించాలనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రోజు ఈ సినిమాకు భారీగా ఆక్యుపెన్సీ నమోదు అయింది.

Bad Newz Day 1 Box Office Collections Worldwide Tripti Dimri movie Start decent at GBOC

ఇక బ్యాడ్ న్యూస్ సినిమాకు తొలి రోజు భారీగా స్పందన కనిపించింది. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, చంఢీగఢ్, భోపాల్ లాంటి నగరాల్లో అత్యధికంగా ఆక్యుపెన్సీ నమోదు అయింది. దాంతో ఇండియాలో ఈ సినిమాకు ఫస్ట్ డే 8.5 కోట్ల రూపాయలు నికర, 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక బ్యాడ్ న్యూస్ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా అంచనాలను మంచి కలెక్షన్లను రాబట్టింది. నార్త్ అమెరికా, యూకే, ఇతర దేశాల్లో ఈ చిత్రం తొలి రోజున 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా వికీ కౌశల్ కెరీర్‌లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X