Bad Newz 10 days Collections: 100 కోట్లు క్లబ్‌లో త్రిప్తి డిమ్రీ.. బాక్సాఫీస్‌ను రఫాడిస్తున్న బ్యాడ్ న్యూస్

యానిమల్ మూవీతో ఓవర్‌నైట్ నేషనల్ క్రష్‌గా మారిన త్రిప్తి డిమ్రి నటించిన బ్యాడ్ న్యూస్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహించని కలెక్షన్లు సాధిస్తున్నది. బాలీవుడ్‌లో యువ హీరోలు వికీ కౌశల్, అమీ విర్క్ నటించిన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు నమోదు చేస్తున్నది. ఈ చిత్రం గత 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అడల్డ్ కంటెంట్‌ను కాస్త జోడించి.. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన బ్యాడ్ న్యూస్ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇతర ఖర్చులు కలిపితే 90 కోట్ల రూపాయలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 100 కోట్లుగా వాల్యూ వేశారు. పాటలు, ట్రైలర్లు, ఇతర ప్రమోషన్స్ కారణంగా బజ్ క్రియేట్ కావడంతో ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Bad Newz Day 10 Box Office Collections Worldwide Tripti Dimri movie racing towards 50 Crores Club

బ్యాడ్ న్యూస్ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు 8.5 కోట్లు, రెండో రోజు 10.5 కోట్లు, 3వ రోజు 11 కోట్లు వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం 30 కోట్లు ఇండియాలోనే రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 43 కోట్ల రూపాయలు రాబట్టింది.

త్రిప్తి డిమ్రి నటించిన ఈ సినిమా కేవలం మల్టీప్లెక్స్, అర్బన్ ప్రాంతాల్లోనే ఆదరణ సంపాదించుకోవడంతో ఈ మూవీ రెండోవారంలో అదే జోష్‌ను కొనసాగించింది. 8వ రోజున 2 కోట్ల రూపాయలు, 9వ రోజున 3.5 కోట్లు, 10వ రోజున 4 కోట్లు, వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 10 కోట్ల రూపాయలు అంటే 53 కోట్ల రూపాయల నికరంగా ఇండియాలో రాబట్టింది.

Bad Newz Day 10 Box Office Collections Worldwide Tripti Dimri movie racing towards 50 Crores Club

ఇక ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్ న్యూస్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 64 కోట్ల రూపాయల గ్రాస్, 53 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 94 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ వారం ముగిసే సమయానికి ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X