Bad Newz Collections త్రిప్తి డిమ్రీ మూవీకి స్టార్ హీరోలకు మించి రికార్డు కలెక్షన్లు..2వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించిన చిత్రం బ్యాడ్ న్యూస్. యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదిందుకొన్న త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వికీ కౌశల్, ఆమీ విర్క్ కీలక పాత్రల్లో నటించారు. అనన్య పాండే, నేహా శర్మ అతిథి పాత్రల్లో మెరిసారు. జూలై 19వ తదీన విడుదలైన ఈ చిత్రం గత రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లో వెళితే..

బ్యాడ్ న్యూస్ సినిమాను సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో ఇండియాలోనే 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మరో 1000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. 100 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Bad Newz Day 2 Box Office Collections Worldwide Tripti Dimri Cinema of fire at GBOC

బ్యాడ్ న్యూస్ సినిమా ట్రైలర్, పాటలకు మంచి బజ్ రావడం, ప్రమోషన్స్ భారీగా చేయడంతో హిందీలో స్టార్ హీరోలకు ఈ మధ్య నమోదు కానుటువంటి అడ్వాన్స్ బుకింగ్ ఈ సినిమాకు రిజిస్టర్ అయ్యాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 9 కోట్ల రూపాయలు ఇండియాలో వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ ఈ చిత్రం 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ మూవీ తొలి రోజున 11 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

త్రిప్తి డిమ్రి సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్ రావడం, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అనుకొన్న వారికి ఈ సినిమా ఫ్యామిలీ మూవీ అని తెలియడం, శనివారం వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగాయి. తొలి రోజు కంటే రెండో రోజు 18 శాతం వృద్ధిని సాధించింది. దాంతో ఈ సినిమా రెండో రోజు ఇండియాలో 10.5 కోట్ల రూపాయలు వసూలుచేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 3 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు 13.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Bad Newz Day 2 Box Office Collections Worldwide Tripti Dimri Cinema of fire at GBOC

ఇక రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 11 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు 13.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 24 కోట్ల రూపాయలు రాబట్టింది. ఆదివారం కూడా సెలవు దినం కావడంతో ఈ చిత్రం భారీగానే కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ఇటీవల బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ సినిమాలకు హీరోలు సాధించని విధంగా త్రిప్తి డిమ్రి నటించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతున్నది. రానున్న రోజుల్లో ఈ సిిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. వర్షాల కారణంగా కొంత మేరకు కలెక్షన్లు తగ్గాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X