Bad Newz 3 days Collections 50 కోట్లకు చేరువైన బ్యాడ్ న్యూస్.. త్రిప్తి డిమ్రీ మూవీకి 3 రోజుల్లో ఎన్ని కోట్లం

బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్యాడ్ న్యూజ్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రంలో వికీ కౌశల్, అమీ విర్క్ ముఖ్య పాత్రల్లో నటించాను. ఇక అనన్య పాండే, నేహా శర్మ అతిథి పాత్రల్లో మెరిసారు. ఈ సినిమా గత మూడు రోజుల్లో ఎంత వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషన్స్, ఇతర ఖర్చులు కలిపితే 90 కోట్ల రూపాయలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 100 కోట్లుగా వాల్యూ వేశారు.

Bad Newz Day 3 Box Office Collections Worldwide Tripti Dimri movie racing towards 50 Crores Club

ఇండియాలో బ్యాడ్ న్యూస్ సినిమా ప్రమోషన్స్‌కు భారీగా స్పందన రావడంతో సుమారుగా 2500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన హిందీ సినిమాల్లో ఒకటిగా బ్యాడ్ న్యూస్ నిలిచింది. ఈ చిత్రం తొలి రోజున 9 కోట్ల రూపాయల నికర వసూళ్లను ఇండియాలో సాధించింది.

ఇక వికీ కౌశల్ రొమాంటిక్ పాత్రలో నటించిన ఈ చిత్రం రెండో రోజున సుమారుగా 11 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. అలాగే ఈ చిత్రం ఆదివారం రోజున గత రెండు రోజుల కంటే అత్యధికంగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 12 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 32 కోట్లు నికరంగా రూపాయలను కలెక్ట్ చేసింది.

Bad Newz Day 3 Box Office Collections Worldwide Tripti Dimri movie racing towards 50 Crores Club

ఇక ఓవర్సీస్‌లో బ్యాడ్ న్యూస్ చిత్రం పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ చిత్రం గత మూడు రోజుల్లో 500K డాలర్లు అంటే.. సుమారుగా 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

బ్యాడ్ న్యూస్ మూవీ వరల్డ్ వైడ్‌ ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 30 కోట్లు నికరంగా, 36 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 13 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 49 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X