Bad Newz Day 5 Collections: 100 కోట్లపై కన్నేసిన త్రిప్తి డిమ్రీ.. బ్యాడ్ న్యూస్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్‌లో యూత్‌పుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన చిత్రం బ్యాడ్ న్యూజ్. యానిమల్ సినిమా ద్వారా పాపులారిటీ సాధించిన త్రిప్తి డిమ్రి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. హిందీ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మించిన ఈ చిత్రంలో యువ హీరో వికీ కౌశల్ హీరోగా కనిపించారు. అడల్డ్ కంటెంట్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా గత రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

బ్యాడ్ న్యూస్ సినిమా విషయానికి వస్తే.. ఓ అరుదైన పాయింట్‌తో రూపొందించారు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ప్రేమికులు.. ఓ కారణంగా విడిపోతారు. అయితే డైవొర్స్ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆ యువతి మరో వ్యక్తితోపాటు భర్తతోను ఒకే రాత్రి శృంగారంలో పాల్గొంటుంది. ఆ తర్వాత ఆమె గర్బవతి కావడం.. ప్రెగ్నెన్సీలో కవలలకు జన్మనివ్వడంతో.. ఆ పిల్లలకు ఎవరు తండ్రి అనే పాయింట్‌తో సినిమా రూపొందింది.

Bad Newz Day 5 Box Office Collections Worldwide Tripti Dimri movie heading towards 100 Crores

యూత్‌లో త్రిప్తి డిమ్రీకి ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా తొలి రోజే 9 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. 2వ రోజు 10.5 కోట్లు, 3వ రోజు 11.5 కోట్లు వసూలు చేసింది. 4వ రోజు 3.5 కోట్లు వసూలు చేసింది. దాంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా 34 కోట్లు వసూలు చేసింది.

ఇక 5వ రోజు ఈ సినిమా నిలకడగా వసూళ్లను సాధించింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాల్లో భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 4 కోట్ల రూపాయలు ఇండియాలో రాబట్టింది. దాంతో ఈ సినిమా 38 కోట్లు వసూలు చేసింది.

Bad Newz Day 5 Box Office Collections Worldwide Tripti Dimri movie heading towards 100 Crores

ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ,గల్ఫ్ దేశాల్లో భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో 25 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్ న్యూస్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 38 కోట్ల రూపాయల నికరంగా.. 45 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదే ఊపును కొనసాగిస్తే.. త్వరలోనే 100 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X