Badass Ravi Kumar Collections:ప్రభుదేవా మూవీకి బంపర్ ఓపెనింగ్స్..హిమేష్ మ్యూజికల్ థ్రిల్లర్‌కు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ యాక్టర్ హిమేశ్ రేషమ్మియా, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, కృతి కుల్హారీ, సన్నీలియోన్ తదితరులు నటించిన మ్యూజికల్ యాక్షన్ ఫిల్మ్ బ్యాడ్ఆస్ రవి కుమార్ (Badass Ravi Kumar). హీరో హిమేష్ స్వయంగా నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమాకు కీత్ గోమ్స్ దర్వకత్వం వహించారు. హిమేష్ రేషమ్మియా మెలోడిస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత? బాక్సాఫీస్ వద్ద రాబడుతున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బ్యాడ్ఆస్ రవికుమార్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ కోసం హిమేష్ అన్నీ తానై వ్యవహరించారు. నటుడిగా, నిర్మాతగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా తన ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమాకు పాటలతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 25 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు.

Badass Ravi Kumar day 2 Expected Box Office Collection Worldwide Himesh Reshammiya Prabhu Deva movie decent start in North India

సన్నీలియోన్, ప్రభుదేవా, జానీ లీవర్ లాంటి నటులతో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీకి క్రియేట్ అయిన బజ్ కారణంగా ఈ సినిమాను హిమేష్, ప్రభుదేవా కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో ఈ సినిమాను సుమారుగా 2000 స్క్రీన్లలో విడుదల చేశారు.

మ్యూజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన థియేటర్లలో లభించింది. ఇటీవల రిలీజైన హిందీ సినిమాల కంటే బెటర్‌గా ఆక్యుపెన్సీని సంపాదించింది. శుక్రవారం ఈ సినిమా 35 శాతం ఆక్యుపెన్సీ సాధించగా.. శనివారం సుమారుగా 30 శాతానికిపైగా ఆక్యుపెన్సీని నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బ్యాడ్ఆస్ రవికుమార్ సినిమాకు నార్త్ ఇండియాలోను మంచి కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా ఉత్తరాదిలో 2.8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగా, ఇతర రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా సుమారుగా 3.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇటీవల రిలీజైన ఫతే, లవ్‌యప్పా లాంటి సినిమాల కంటే మెరుగైన కలెక్షన్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. కనీసం 20 కోట్ల షేర్, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో ఈ సినిమా ఏ రేంజ్ లాభాలను రాబడుతుంది? బ్రేక్ ఈవెన్ అవుతందా? అనే వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: himesh reshammiya prabhu deva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X