Bade Miyan Chote Miyan Collections 100 కోట్లు దాటిన బడేమియా చోటే మియా.. ఇంకా భారీ నష్టాల్లోనే!

బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దయనీయమైన కలెక్షన్లను రాబడుతున్నది. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపలేకపోతున్నది. యువ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో జాకీ భగ్నానీ, వషు భగ్నానీ నిర్మించారు. యువ తారలు సోనాక్షి సిన్హా, మనుషీ చిల్లర్ నటించిన రంజాన్ పండుగ కానుకగా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత 6 రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా అతడి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లకే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మరో 100 కోట్ల రూపాయలు వ్యయం అయింది. ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

Bade Miyan Chote Miyan 6 days Collections Akshay Kumar movie crossed 100 crores at GBOC

గత 6 రోజుల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. బడేమియా చోటేమియా సినిమా ఆరంభంలో సెలవుల కారణంగా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. తొలి రోజు 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే రెండో రోజు 50 శాతం డ్రాప్‌తో 7.5 కోట్లు, 3వ రోజు 9 కోట్లు, నాలుగో రోజు 9 కోట్లు వసూలు చేసింది. సోమవారం నాడు అంటే 5వ రోజు నుంచి పూర్తిగా వసూళ్లు క్షీణించాయి. 5వ రోజు 2.5 కోట్లు, 6వ రోజు 2 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

ఇక ప్రాంతాల వారీగా టైగర్ ష్రాఫ్ మూవీ సాధించిన కలెక్షన్ల వివారాల్లోకి వెళితే.. హిందీలో 45 కోట్లు నెట్, తమిళంలో 25 లక్షలు నికరంగా, తెలుగులో 20 లక్షలు, మలయాళంలో 10 లక్షలు, కన్నడలో 1 కోటి రూపాయలు వసూళ్లను సాధించింది. ఇండియా వైడ్‌ 47 కోట్ల నికర వసూళ్లు, 65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సోనాక్షి సిన్హా, మనుషి చిల్లర్ నటించిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్పందన లభించింది. ముఖ్యంగా గల్ఫ్, యూఏఈలో ఈ చిత్రం అధికంగా కలెక్షన్లను నమోదు చేసింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 28 కోట్లు నికరంగా 35 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తాజాగా డిస్టిబ్యూటర్లు వెల్లడించిన ప్రకారం.. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటింది.

Bade Miyan Chote Miyan 6 days Collections Akshay Kumar movie crossed 100 crores at GBOC

ఇక బడేమియా చోటేమియా సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినప్పటికీ.. ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంగానే ఉంది. ఈ సినిమా నష్టాల నుంచి బయటపడాలంటే.. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ఏదో జరగాల్సిందే అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏ మేరకు నష్టాలను తగ్గించుకొంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X