Bade Miyan Chote Miyan Collections: 350 కోట్ల బడ్జెట్.. అక్షయ్ కుమార్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు!
బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మనుషీ చిల్లర్ తదితరులు నటించిన తాజా చిత్రం బడె మియా, చోటే మియా. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో జాకీ భగ్నానీ, వషు భగ్నానీ నిర్మించారు. రంజాన్ పండుగ కానుకగా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బడే మియా చోటే మియా సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్లే కాకుండా టాప్ క్యారెక్టర్ ఆరిస్టులు నటించారు. ఈ సినిమాలో నటించిన వారికి కేవలం 250 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ రూపంలో చెల్లించారు. ఇక ఈ సినిమా ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులకు సుమారుగా 100 కోట్ల రూపాయలు మేర బడ్జెట్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అక్షయ్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోల కారణంగా ఈ సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు సొంతం చేసుకొన్నది. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉండటంతో వరల్డ్ వైడ్ రికార్డు స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఇండియాలోనే 3000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో విడుదల చేశారు. దాంతో మొత్తంగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
సోనాక్షి సిన్హా చాలా రోజుల తర్వాత నటించిన ఈ సినిమా తొలి రోజు భారీగా కలెక్షన్లను సాధించింది. హిందీలో 15.5 కోట్ల రూపాయలు, తమిళంలో 80 లక్షల రూపాయలు, తెలుగులో 50 లక్షలు, మలయాళం, కన్నడలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు 16.5 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించింది.

ఇక రెండో రోజు ఈ సినిమా అదే జోష్‌ను బాక్సాఫీస్ వద్ద కొనసాగించలేకపోయింది. ఈ సినిమా 50 శాతం డ్రాప్‌ను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసుకొన్నది. ఈ సినిమా హిందీలో 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగితా భాషల్లో కలిపి మొత్తంగా 8 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది.
ఇక మూడో రోజు కూడా బడేమియా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తాజా వివరాల ప్రకారం ఇండియాలో 8 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా మొత్తంగా 32 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
ఇండియాలో ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయలు వసూలు చేసిన బడే మియా చోటే మియా చిత్రం విదేశాల్లో కూడా బారీ వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 1.55 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక 4వ రోజు కూడా సెలవు రోజు కావడంతో ఈ సినిమాకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ సినిమా ఇండియాలో 6 కోట్ల రూాపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











