Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న అమితాబ్ బచ్చన్, తాప్సీ ‘బద్లా’
'పింక్' తర్వాత అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను కాంబినేషన్లో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'బద్లా' బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఓ వైపు మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన భారీ హాలీవుడ్ మూవీ 'కెప్టెన్ మార్వెల్' నుంచి గట్టి పోటీ, మరో వైపు ఆదివారం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కారణంగా ప్రేక్షకుల తాకిడి తగ్గినప్పటికీ ఫస్ట్ వీకెంట్ మంచి వసూళ్లు నమోదు చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీ... పింక్, 102 నాటౌట్ చిత్రాల వసూళ్లను అధిగమించింది.
ఓపెనింగ్ వీకెంట్ రికార్డ్స్ బద్దలు
‘బద్లా' వసూళ్ల గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ... ‘పింక్, 102 నాటౌట్ చిత్రాల ఫస్ట్ వీకెండ్ రికార్డులను ‘బద్లా' బద్దలు కొట్టింది. గతంలో పింక్ రూ. 21.51 కోట్లు, 102 నాటౌట్ రూ. 16.65 కోట్లు వసూలు చేస్తే... బద్లా రూ. 23.20 కోట్లు రాబట్టింది అని ట్వీట్ చేశారు.
అద్భుతమైన మౌత్ టాక్
‘బద్లా' చిత్రానికి అద్భుతమైన మౌత్ టాక్ వినిపిస్తోంది. మెట్రో సీటీస్, మల్టీప్లెక్స్, టైర్ 2 సిటీస్ తదితర ప్రాంతాల్లో వసూళ్లు రోజు రోజకు పెరుగుతున్నాయి. తొలి రోజైన శుక్రవారం రూ. 5.04 కోట్లు వసూలు చేయగా శనివారం రూ. 8.55 కట్లు, ఆదివారం రూ. 9.61 కోట్లు వసూలు చేసింది. ఇంటియా వ్యాప్తంగా రూ. 23.20 కోట్లు రాబట్టింది. టోటల్ గ్రాస్ రూ. 27.38 కోట్లు వసూలైంది.
బద్లా
స్పానిష్ సూపర్ హిట్ మూవీని హిందీలో 'బద్లా' పేరుతో రీమేక్ చేశారు. రివేంజ్ తీర్చుకోవడానికి నిజాన్ని అన్వేషించే నైనా సేథి(తాప్సీ) అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బాదల్ గుప్తా పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. సుజోయ్ గోష్ దర్శకత్వం వహించగా, షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు.
కెప్టెన్ మార్వెల్
మరో వైపు హాలీవుడ్ మూవీ ‘కెప్టెన్ మార్వెల్' శనివారం వరకు రూ. 27 కోట్లు వసూలు చేసింది. ఆదివారం వసూళ్లు కూడా కలిస్తే ఫస్ట్ వీకెంట్ రూ. 40 కోట్ల మార్కును అధిగమిస్తుందని అంచనా. ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో గ్యారంటీ హిట్ అని తేలిపోయింది.